విజయ్‌ చిత్రంలో నటించడం లేదు: విద్యుత్‌

అతను మార్షల్ ఆర్ట్స్లో నేర్పరి. ఎలాంటి ఫైట్స్ అయినా చాలా ఈజీగా చేయగలడు. ‘కమాండో’ సిరీస్ వంటి యాక్షన్ చిత్రాలలో పేరు తెచ్చుకున్న బాలీవుడ్‌ నటుడు విద్యుత్‌ జమ్వాల్‌. గత కొన్నాళ్లుగా తమిళ నటుడు విజయ్‌ ‘దళపతి 65’ చిత్రంలో విలన్‌ నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

Published : 03 Apr 2021 13:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అతడికి మార్షల్ ఆర్ట్స్‌లో ఎంతో నైపుణ్యం ఉంది. ఎలాంటి ఫైట్స్ అయినా చాలా ఈజీగా చేయగలడు. ‘కమాండో’ సిరీస్ వంటి యాక్షన్ చిత్రాలలో పేరు తెచ్చుకున్న బాలీవుడ్‌ నటుడు విద్యుత్‌ జమ్వాల్‌. గత కొంతకాలంగా తమిళ నటుడు విజయ్‌ ‘దళపతి 65’ చిత్రంలో విలన్‌గా‌ నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ట్వీటర్‌ వేదికగా ఆయన స్పందిస్తూ..‘‘అతనితో కలిసి నటించాలని ఉంది. కానీ ఈ వార్త మాత్రం నిజం కాదు’’ అని వెల్లడించారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమౌతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమం ఇటీవల ప్రారంభమైంది. విద్యుత్ జమ్వాల్ గతంలో విజయ్‌తో కలిసి ‘తుపాకీ’ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. తెలుగులో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ‘శక్తి’, ‘ఊసరవెల్లి’ చిత్రాల్లోనూ ప్రతినాయకుడిగా మెప్పించారు. ప్రస్తుతం ‘సనక్‌’ అనే హిందీ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని