Deepika Padukone: ఐస్‌క్రీమ్ నా స్కూల్ డేస్‌ను గుర్తు చేస్తోంది..

ఐస్‌క్రీమ్‌ను చూస్తే నా స్కూల్‌ డేస్‌ గుర్తొస్తాయి. ప్రతి బుధవారం ఓ వ్యక్తి మా స్కూల్‌ దగ్గర ఐస్‌క్రీమ్‌ అమ్మేవారు.

Published : 17 Sep 2021 20:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో దీపికా పదుకొనే ముందు వరుసలో ఉంటారు. రామ్‌లీలా, పద్మావత్‌, ఛపాక్‌, పీకూ వంటి చిత్రాల్లో తన నటనతో అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు. ఆమె నటనా కౌశలానికి, ఫ్యాషన్‌కు, బలమైన వ్యక్తిత్వానికి చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లను అలరిస్తుంటారు. ఎప్పటికప్పుడు వివిధ రకాల విషయాలను సరదాగా పంచుకుంటూ ఉంటారు. భర్త రణ్‌వీర్ సింగ్‌ను ఆటపట్టించడం, రోజువారీగా సాగే విషయాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంటారు. ఆమెకు ఇన్‌స్టాలో 60లక్షలకు పైగా మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.

తాజాగా దీపికా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీల్లో క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ సెషన్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో ‘ఐస్‌క్రీమ్‌’ అనే పదానికి దీపికా సమాధానం ఇచ్చారు. ‘‘ఐస్‌క్రీమ్‌ను చూస్తే నా స్కూల్‌ డేస్‌ గుర్తొస్తాయి. ప్రతి బుధవారం ఓ వ్యక్తి మా స్కూల్‌ దగ్గర ఐస్‌క్రీమ్‌ అమ్మేవారు. వెనిలా, స్ట్రాబెరీలను రూ.5 ఇచ్చి కొనుక్కొనే దాన్ని’’ అని రాసుకొచ్చారు. ఆమె చెప్పిన ఈ సమాధానానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. అంతేకాకుండా కళ్లు, విలువైనవి, సాంగ్‌ వంటి ఇతర పదాలకు ఆమె తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటూ అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ఈ సెషన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం వినోదాత్మకంగా సాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని