
Allu arjun: అల్లు అర్జున్ కొత్త మూవీ థియేటర్ ‘AAA’ సినిమాస్
హైదరాబాద్: నటనే కాదు, వ్యాపార రంగంలోనూ తమదైన ముద్రవేయాలని తెలుగు సినీ కథానాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ మూవీ థియేటర్స్‌ను ప్రారంభించగా, త్వరలో అల్లు అర్జున్ కూడా అదే బాటలో పయనించనున్నారు. ‘AAA’ సినిమాస్ పేరుతో అందుబాటులోకి తీసుకొస్తున్న థియేటర్‌కు శనివారం బన్ని పూజా కార్యక్రమం నిర్వహించారు. నిర్మాత సునీల్ నారంగ్, నారాయణ దాస్‌లు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సరికొత్త టెక్నాలజీతో హైదరాబాద్‌లో ఈ థియేటర్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అల్లుఅర్జున్ ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకుడు. రష్మిక కథానాయిక. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.