Bollywood: ‘కేజీయఫ్‌’ని షారుఖ్‌తో తీస్తే ప్రేక్షకులు ఒప్పుకునేవారు కాదు

ప్రపంచవ్యాప్తంగా సూపర్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్న బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కేజీయఫ్‌’ని(KGF) యశ్‌తో(YASH) కాకుండా బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌తో(Sharukh Khan) తీస్తే...

Published : 01 Jul 2022 16:22 IST

బీటౌన్‌ యువ రచయిత వ్యాఖ్యలు

ముంబయి: ప్రపంచవ్యాప్తంగా సూపర్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్న బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కేజీయఫ్‌’ని(KGF) యశ్‌తో(YASH) కాకుండా బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌తో(Sharukh Khan) తీస్తే ప్రేక్షకులు అంగీకరించేవాళ్లు కాదని బీటౌన్‌ యువ రచయిత రాజ్‌ సలుజా(Raj Saluja) అన్నారు. ఆయన రచయితగా వ్యవహరించిన ‘రాష్ట్ర కవచ్‌ ఓం’(OM) విడుదలైన సందర్భంగా ఓ ఛానల్‌తో ముచ్చటించారు. బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లు సరిగ్గా ఆడకపోవడంపై స్పందించారు.

‘‘బాలీవుడ్‌(Bollywood) చిత్రాల వైఫల్యానికి కారణం కథలు కాదు. ప్రేక్షకుల అభిరుచుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం వాళ్లు దక్షిణాది చిత్రాలను ఆదరిస్తున్నారు. అక్కడి నుంచి వచ్చే సినిమాలను ఇష్టపడుతున్నారు. ఏ సినిమాలను ఆదరించాలనేది వాళ్ల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ‘కేజీయఫ్‌’ని యశ్‌తో కాకుండా షారుఖ్‌తో తీస్తే ప్రేక్షకులు చూసేవాళ్లు కాదు. బాలీవుడ్‌ హీరోలు ఇలాంటి సినిమాలు చేస్తే అంగీకరించేందుకు వాళ్లు సిద్ధంగా లేరు. అక్కడి దాకా ఎందుకు.. ఇటీవల విడుదలైన ‘సత్యమేవజయతే’లో జాన్‌ అబ్రహం యాక్షన్‌ సీక్వెన్స్‌లు అద్భుతంగా చేశాడు. కానీ ఆ సినిమా రిజల్ట్‌ చూశాం కదా. ఇక్కడి ప్రేక్షకులు ఎలా ఉన్నారంటే.. మన హీరోలు ఏం చేసినా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు కానీ.. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, యశ్‌.. ఇలా అక్కడి హీరోలు చేస్తే ఓకే అంటున్నారు’’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఆదిత్యా రాయ్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘రాష్ట్ర కవచ్‌ ఓం’ చిత్రానికి రాజ్‌ సలుజా రచయితగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని