Kashmir Files: ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ వివాదం.. ‘ఇఫి’ జ్యూరీ హెడ్‌ క్షమాపణలు

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాపై ఇజ్రాయెల్‌ దర్శకుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దానిపై ఆయన స్పందిస్తూ.. క్షమాపణలు చెప్పారు.

Published : 02 Dec 2022 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ (The Kashmir Files) సినిమాపై తాను చేసిన వ్యాఖ్యలతో బాధపడిన వారికి ఇజ్రాయెల్‌ దర్శకుడు నడవ్‌ లాపిడ్‌ క్షమాపణలు చెప్పారు. ఆయన ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తానెప్పుడూ ఎవరినీ అవమానించాలనుకోనని, అది తన ఉద్దేశం కాదని తెలిపారు. తన మాటలకు ఎవరైనా బాధపడితే అందుకు క్షమించాలని కోరారు. చిత్ర దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి కోపాన్ని తాను అర్థం చేసుకున్నానని పేర్కొన్నారు. సంబంధిత వార్త లింక్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన వివేక్‌.. ప్రపంచంలోనే అత్యంత నిజాయతీపరుడు అని నడవ్‌ లాపిడ్‌ను ఉద్దేశించి అన్నారు. 

ఏం జరిగిందంటే?: గోవాలో ఇటీవల ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి) వేడుకలు జరిగాయి. అక్కడ ఇతర చిత్రాలతోపాటు ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’నూ ప్రదర్శించారు. ‘ఇఫి’ జ్యూరీ హెడ్‌గా ఉన్న నడవ్‌ వేడుక చివరి రోజున (నవంబరు 28) మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా చూసి దిగ్భ్రాంతి చెందా. ఇది ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం’’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దర్శకుడు వివేక్‌, నటుడు అనుపమ్‌ ఖేర్‌, పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా నడవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భారత్‌తోపాటు ఇజ్రాయెల్‌లోనూ నడవ్‌ కామెంట్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు