లక్షలాది మంది మనసులను కదిలించే రాజా

ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు ఇళయరాజా నేడు తన 78వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Published : 02 Jun 2021 20:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు ఇళయరాజా నేడు తన 78వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన తెలుగు, తమిళంలో ఎన్నో చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. అవన్నీ చాలా వరకు అఖండ విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా ఆయన సంగీతం సమకూర్చిన ‘స్వాతి ముత్యం’, ‘నాయగన్’, ‘తేవర్ మగన్’, ‘అంజలి’, ‘గురు’, ‘హే రామ్’ వంటి సినిమాలను భారత్‌ నుంచి ఆస్కార్‌కి నామినేట్ చేశారు. కమల్‌హాసన్‌ ఇళయరాజాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘‘ఎంతోమంది మనసులకు నచ్చినవాడు.. లక్షలాది మంది మనసులను కలిపే మాస్ట్రో ఇళయరాజాకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ ట్విటర్‌ ద్వారా తెలిపారు. కమల్‌ నటించిన ఎన్నో విజయవంతమైన చిత్రాలకు మాస్ట్రో సంగీత స్వరాలు అందించి, విజయానికి బాసటగా నిలిచారు. ‘అన్నాకిలి’ (1976) సినిమాతో ఇళయరాజా స్వరకర్తగా అడుగుపెట్టి 45 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రాన్ని 1978లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించారు. ఇదే సినిమాని తెలుగులో ‘రామ చిలక’ (1978)గా రీమేక్ చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు