Ileana: ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క వెబ్ సిరీస్‌లు చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి ఎందరో నటీనటులు సిద్ధమౌతున్నారు.
ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క వెబ్ సిరీస్‌లు చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి ఎందరో నటీనటులు సిద్ధమౌతున్నారు. అదే బాటలో నడుస్తుంది కథానాయిక ఇలియానా. తాజాగా ఆషీ దూవా నిర్మించిన ఒక వెబ్ సిరీస్‌లో నటించింది ఇలియానా (Ileana). ఆ సిరీస్ ఈ ఏడాది చివర్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ‘ఇటీవలే వెబ్ షో ను పూర్తి చేసుకున్నాము. ఇప్పుడది నిర్మాణానంతర పనుల్లో ఉంది. బీబీసీ స్టూడియోస్‌తో కలిసి అప్లోస్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మించింది. ఈ ఏడాది చివరిన నేను నిర్మించిన ఆ సిరీస్‌ను, మరో షోను ఒకేసారి విడుదల చేయాలని అనుకుంటున్నాను’ అని నిర్మాత ఆషీ దూవా తెలిపింది. ‘బర్ఫీ లో ఇలియానా నటన నాకు చాలా నచ్చింది. తన నటనతో నేను ప్రేమలో పడిపోయాను. తను వెబ్ షోలో నటిస్తుందో లేదో తెలియదు. కరీష్మా కోహ్లీ దర్శకత్వంలో వచ్చిన ఆ వెబ్ సిరీస్ కథను సిద్ధం చేసుకున్నప్పుడు ఇలియానా అందులో నటిస్తుందో లేదో అనుకున్నాము. కానీ ఆ కథ చదివిన వెంటనే సిరీస్ చేయడానికి ఒప్పుకుంది. ఈ సిరీస్‌లో ఇలియానా చాలా బాగా నటించింది. దానిని మీరందరూ చూడాలని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాను’ అంటూ దూవా అన్నారు. ఇలియానా నటించిన ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ’ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Laddu Auction: గచ్చిబౌలిలో రూ.25.5 లక్షలు పలికిన గణపయ్య లడ్డూ
-
Muttiah Muralitharan: నాని సినిమాలు ఎక్కువగా చూశా: ముత్తయ్య మురళీధరన్
-
Sony earbuds: సోనీ నుంచి ఫ్లాగ్షిప్ ఇయర్‌బడ్స్.. 5జీ స్మార్ట్‌ఫోన్ కంటే ఎక్కువే!
-
Siddaramaiah: అప్పులు తెచ్చుకొని.. ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకోవద్దు: కర్ణాటక సీఎం
-
Hyderabad: గణేశ్ నిమజ్జనం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా!
-
PM Modi: నాకు సొంతిల్లు లేదు.. కానీ: ప్రధాని మోదీ