ఐటమ్‌ గాళ్‌గా ఇలియానా.. టాలీవుడ్‌లో మళ్లీ రీఎంట్రీ ఇవ్వనుందా..!

ఒకప్పుడు టాలీవుడ్‌ను షేక్‌ చేసిన హీరోయిన్‌ ఇలియానా. ‘పోకిరి’ వంటి కమర్షియల్‌ చిత్రాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. ఈ గోవా బ్యూటీ తెలుగులో ‘దేవదాసు’, ‘రాఖీ’, ‘జల్సా’, ‘కిక్‌’, ‘జులాయి’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించింది. అయితే 2012లో వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’

Published : 17 Aug 2021 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు టాలీవుడ్‌ను షేక్‌ చేసిన హీరోయిన్‌ ఇలియానా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటుందా..? అంటే అవుననే అంటున్నాయి సినిమా వర్గాలు. ‘పోకిరి’ వంటి కమర్షియల్‌ చిత్రాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిందీ గోవా బ్యూటీ. తెలుగులో ‘దేవదాసు’, ‘రాఖీ’, ‘జల్సా’, ‘కిక్‌’, ‘జులాయి’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించింది. అయితే 2012లో వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. అలా కొంతకాలం పాటు టాలీవుడ్‌కు దూరమైంది. బాలీవుడ్‌లో అడపాడడపా సినిమాలు చేస్తూ వస్తోంది. 2018లో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ చిత్రంతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ఆమె మరోసారి తెలుగు తెరకు దూరమైంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఆమె రెండోసారి ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. రవితేజ హీరోగా ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఇలియానా ఒక ఐటమ్‌ సాంగ్‌లో కనిపించనుందట. దీని ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించాలని  ఆశిస్తోందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొంతకాలం ఎదురుచూడాల్సిందే మరి.

శరత్‌ మండప దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వాధికారి పాత్రలో కనిపించనున్నారు. రాజీషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలు. వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కుతోందీ చిత్రం. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌  శరవేగంగా సాగుతోంది. పలు కుటుంబ కథా చిత్రాల్లో నటించి మెప్పించిన నటుడు వేణు ఇదే సినిమాతో రీఎంట్రీ ఇవ్వనుండటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని