Ileana: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మాట వాస్తవమే.. కానీ: ఇలియానా

‘దేవదాసు‌’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే తెలుగువారి మన్ననలు అందుకున్న గోవా బ్యూటీ ఇలియానా. ఒకానొక సమయంలో తెలుగులో...

Published : 15 Apr 2022 13:25 IST

ఇంటర్నెట్‌డెస్క్: ‘దేవదాసు‌’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే తెలుగునాట మంచి గుర్తింపు పొందిన గోవా బ్యూటీ ఇలియానా. గతంలో తెలుగులో వరుస సినిమాలు చేసి అలరించిన ఈమె ప్రస్తుతం టాలీవుడ్‌కు కాస్త దూరంగా ఉంది. ఆరేళ్ల తర్వాత ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’తో మళ్లీ తెలుగు తెరపై సందడి చేసింది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేదు. దీంతో ఇలియానా ప్రస్తుతం హిందీ చిత్రాలపై దృష్టి పెట్టారు. కాగా, శారీరక సమస్యలతో ఇలియానా ఇబ్బంది పడుతున్నారని, దానివల్ల ఆమె గతంలో ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారని ఇటీవల పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలపై తాజాగా ఆమె స్పందించారు.

‘‘సుమారు 12 ఏళ్ల వయసు నుంచే నేను శారీరక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాను. దాని నుంచి బయటపడేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అయితే, శరీరాకృతి విషయంలో అవహేళన ఎదుర్కొవడం వల్ల నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని.. ఇటీవల పలు వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. వాటిని చూసిన నా స్నేహితులు నాకు ఫోన్‌ చేసి.. ఇదంతా నిజమేనా..! అని అడుగుతున్నారు. అయితే.. శారీరక సమస్యల వల్ల నేను ఏ రోజు చనిపోవాలనుకోలేదు. గతంలో నేను ఎంతో మానసిక కుంగుబాటుకు లోనయ్యాను. నిరాశ వల్ల ఆ క్షణంలో చనిపోవాలనిపించింది. ఎలాంటి సంబంధంలేని రెండు విషయాలను కలిపి వార్తలుగా ఇవ్వడం చూసి నాకు చాలా బాధగా అనిపించింది’’ అని ఇలియానా వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని