ఇలియానా నయా బాయ్‌ఫ్రెండ్‌ని చూశారా..!

గోవా బ్యూటీ ఇలియానా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి సందడి చేసింది. ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ పేరిట నిర్వహించి........

Published : 03 Mar 2021 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గోవా బ్యూటీ ఇలియానా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి సందడి చేసింది. ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ పేరిట నిర్వహించిన ఈ చాటింగ్‌లో పలు ఆసక్తికర విషయాలను పంచుకొందీ ముద్దుగుమ్మ. ‘మీ బాయ్‌ ఫ్రెండ్‌  పేరేంటి?’ అని ఓ నెటిజన్అ‌ డగ్గా తాను పెంచుకుంటున్న కుక్కను చూపించి వీడి పేరు ఛార్లీ అంటూ బదులిచ్చింది. గతంలో ఆండ్రూ అనే వ్యక్తితో ఇలియానా ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీళ్లద్దరూ విడిగానే ఉంటున్నారు. ‘దేవదాసు’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు తెరకు దూరంగా ఉంది. ‘అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’, ‘ది బిగ్‌ బుల్‌’ చిత్రాలతో బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని