ileana: ఇది నాకు మరో కెరీర్‌ అవుతుందేమో!

ఇలియానా మ‌రో కెరీర్‌ని ఎంపిక చేసుకోవడం ఏంటి.. అనుకుంటున్నారా?  అస‌లు విష‌యం ఏంటంటే.. లాక్‌డౌన్‌లో ఏం చేయాలో తెలియ‌క స‌మ‌యాన్ని వృథా చేసుకునేవారు కొంద‌రైతే.. కొత్త విష‌యాలు నేర్చుకునేందుకు  ఆస‌క్తి చూపిస్తున్నవారు మ‌రికొంద‌రు.

Published : 15 May 2021 01:16 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ఇలియానా మ‌రో కెరీర్‌ని ఎంపిక చేసుకోవడం ఏంటి.. అనుకుంటున్నారా? అస‌లు విష‌యం ఏంటంటే.. లాక్‌డౌన్‌లో ఏం చేయాలో తెలియ‌క స‌మ‌యాన్ని వృథా చేసుకునేవారు కొంద‌రైతే.. కొత్త విష‌యాలు నేర్చుకునేందుకు ఆస‌క్తి చూపిస్తున్న వారు మ‌రికొంద‌రు. ఈ రెండో జాబితాలోనే నిలుస్తోంది గోవా బ్యూటీ ఇలియానా. త‌న‌లోని చెఫ్‌ని బ‌య‌ట‌పెట్టేందుకు ఈ విరామ సమ‌యం ఎంతో ఉప‌యోగప‌డిందట. వంటింట్లో గ‌రిటెపట్టి ప‌సందైన చాక్లెట్ కేక్‌ని త‌యారు చేసి నోరూరిస్తోంది. స్వ‌యంగా  చేసిన హాట్ హాట్ కేక్‌ని ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. అంతేకాదు ఇది నాకు ప్ర‌త్యామ్నాయ కెరీర్ అవుతుంద‌ని భావిస్తున్నా అంటూ ఓ కొటేష‌న్ పెట్టింది. బేకరిలో ల‌భించే కేక్‌ని ఇంట్లోనే అద్భుతంగా త‌యారు చేశాన‌నే ఉద్దేశం ఈ ముద్దుగుమ్మ‌ది. ఇదండి సంగతి. సినిమా విష‌యానికొస్తే.. ఇటీవ‌ల ది బిగ్ బుల్ చిత్రంతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించిన ఇలియానా త్వ‌ర‌లో అన్‌ఫెయిర్ అండ్ ల‌వ్లీ సినిమాతో సంద‌డి చేయ‌నుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని