IMDb: 2022 మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ స్టార్స్‌ వీరే.. టాప్‌లో ధనుష్‌.. తారక్‌, చెర్రీ స్థానాలేంటి?

2022 మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ స్టార్స్‌ జాబితా విడుదలైంది. ఇందులో నటుడు ధనుష్‌ మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

Published : 08 Dec 2022 01:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2022.. ఈ ఏడాది చివరి దశకు చేరుకున్నాం. మరి కొన్నిరోజుల్లో ఈ సంవత్సరానికి గుడ్‌బై చెప్పనున్నాం. ఈ నేపథ్యంలో 2022కు సంబంధించిన మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ స్టార్స్‌ జాబితాను ఐఎండీబీ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 మిలియన్లకు పైగా సినీ ప్రియుల అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని ఈ ర్యాంకింగ్స్‌ను వెల్లడించినట్లు సదరు సంస్థ పేర్కొంది. సుమారు 10 మంది పేర్లతో ఉన్న ఈ జాబితాలో ధనుష్‌ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక, అలియాభట్‌, ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌, సమంత, కియారా అడ్వాణీ సైతం ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ఎవరెవరు ఏయే స్థానాల్లో ఉన్నారంటే..!

1. ధనుష్‌

2. అలియా భట్‌

3. ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌

4. రామ్‌చరణ్‌

5. సమంత

6. హృతిక్‌ రోషన్‌

7. కియారా అడ్వాణీ

8. ఎన్టీఆర్‌

9. అల్లు అర్జున్‌

10. యశ్‌

ఇక, ఉత్తమ నటుడిగా భారతదేశంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనుష్‌ ఈఏడాది హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. హాలీవుడ్‌ చిత్రం ‘ది గ్రే మ్యాన్‌’లో ఆయన కీలకపాత్ర పోషించారు. జులైలో విడుదలైన ఈ సినిమా అంతటా మంచి టాక్‌ అందుకుంది. మరోవైపు అలియాభట్‌ సైతం ఇదే ఏడాదిలో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆమె ముఖ్య భూమిక పోషిస్తోన్న ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్స్‌’ షూట్‌ ఇటీవల పూరైంది. అలాగే, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో చరణ్‌, తారక్‌, ‘పుష్ప’తో అల్లు అర్జున్‌, ‘కేజీయఫ్‌’తో యశ్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని