IMDb: ‘కాంతార’ 1.. ‘బాహుబలి’ 101.. టాప్‌ 250 సినిమాలివే..

ఐఎండీబీ టాప్‌ 250 ఇండియన్‌ ఫిల్మ్స్‌ జాబితాలో ‘కాంతార’ నంబరు 1గా నిలిచింది. ఇతర సినిమాల వివరాలివీ..

Updated : 18 Oct 2022 10:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కాంతార’ (Kantara).. ప్రస్తుతం అన్ని చోట్లా ఈ పేరే మారుమోగుతోంది. నెట్టింట ఈ కన్నడ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం హాట్‌ టాపిక్‌గా మారుతోంది. రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులోనూ విడుదలైంది. అధిక వసూళ్లతోపాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంటోంది. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ (IMDb) ప్రకటించిన ‘టాప్‌ 250 ఇండియన్‌ ఫిల్మ్స్‌’ (IMDb Top 250) జాబితాలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. తమ యూజర్స్‌ ఇచ్చిన రేటింగ్స్‌ ఆధారంగా ఐఎండీబీ ఆ లిస్ట్‌ను రూపొందించింది. సోషల్‌ మీడియా వేదికగా ఆ వివరాలు పంచుకుంది.

నంబర్‌ 1గా ‘కాంతార’ ఉండగా 2వ స్థానంలో రామాయణ (1993), 3లో రాకెట్రీ (2022), 4లో నాయకన్‌ (1987), 5లో అన్బే శివం (2003), 6లో గోల్‌మాల్‌ (1979), 7లో జై భీమ్‌, 8లో 777 చార్లీ, 9లో పరియెరుమ్‌ పెరుమాళ్‌ (2018), 10లో మణిచిత్రతజు (1993) నిలిచాయి. తెలుగు సినిమాల వివరాలివీ.. కేరాఫ్‌ కంచరపాలెం (17వ స్థానం),  జెర్సీ (22), సీతారామం (39), మహానటి (44), ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ (48), బాహుబలి: ది కన్‌క్లూజన్‌ (101), బొమ్మరిల్లు (125), రంగస్థలం (129), అతడు (134), పెళ్లి చూపులు (146), ఎవరు (155), క్షణం (156), మేజర్‌ (165), వేదం (176), అర్జున్‌ రెడ్డి (179), బాహుబలి: ది బిగినింగ్‌ (182), ఆర్‌ఆర్‌ఆర్‌ (190), ఒక్కడు (209), పోకిరి (212), మనం (217), ఊపిరి (220), హ్యాపీడేస్‌ (236), గూఢచారి (244వ స్థానం).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని