Jai Bhim: ‘జై భీమ్‌’ నంబరు 1.. ‘జనగణ మన’ నంబరు 2.. టాప్‌ 10 కోర్టురూమ్‌ డ్రామాలివీ

ఐఎండీబీ సంస్థ టాప్‌ 10 ఇండియన్‌ మూవీస్‌ లిస్ట్‌ను ప్రకటించింది. ఏ సినిమాకు ఎంత రేటింగ్‌ వచ్చిందంటే?

Published : 28 Jan 2023 14:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ సినిమాకు ఎక్కువ ఆదరణ దక్కింది? ఏ చిత్రాలపై ఎక్కువ మంది ఆసక్తిగా చూపిస్తున్నారు?.. ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలిస్తుంటుంది ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ (IMDb). ఈ క్రమంలోనే.. కోర్టురూమ్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కి, అత్యధిక రేటింట్స్‌ సొంతం చేసుకున్న టాప్‌ 10 భారతీయ సినిమాల జాబితాను ఇటీవల ప్రకటించింది. తమ యూజర్స్‌ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఐఎండీబీ ఆ లిస్ట్‌ను రూపొందించింది.

90ల నుంచి 2023 జనవరి 25 వరకు (న్యాయ పోరాట నేపథ్యంలో రూపొందిన) విడుదలైన సినిమాలన్నింటిపై సర్వే చేసిన అనంతరం.. 8.8 స్టార్‌ రేటింగ్‌తో ‘జై భీమ్‌’ (Jai Bhim) తొలి స్థానంలో నిలిచింది. జనగణ మన (Jana Gana Mana) (8.3) సినిమా ద్వితీయ స్థానం దక్కించుకుంది. మిగిలిన వివరాలివీ.. ట్రైల్‌ బై ఫైర్‌ (8.3), షహిద్‌ (8.2), పింక్ (8.1), గార్గి (8.1), న్నా థాన్‌ కేస్‌ కొడు (8.0), దమిని (7.8), క్రిమినల్‌ జస్టిస్‌: అధుర సాచ్‌ (7.7), కోర్ట్‌ (7.6).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు