
Published : 05 Jul 2021 00:56 IST
సుధీర్ సలహా.. ఆగిపోయిన పెళ్లి
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఆదివారం రెట్టింపు వినోదం పంచుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ఎప్పటిలాగే ఈ ఆదివారం కూడా తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ పెళ్లి పెద్దలుగా ఉండి బుల్లితెర జంట ఇమ్మాన్యుయెల్, వర్షను ఒక్కటి చేశారు. అయితే.. ఇదంతా జరిగింది ఇమ్మాన్యుయెల్ ఊహలో.. ఎందుకంటే.. పెళ్లికి 20మందిని మాత్రమే పిలవాలనే నిబంధన ఉండగా.. 40 మందిని పిలవమని సుధీర్ ఇచ్చిన సలహాతో ఇమ్మూ పెళ్లి ఆగిపోయింది పాపం. దీంతో ఇమ్మాన్యుయెల్ కోపం తట్టుకోలేక ‘ఓరెయ్ సుధీర్ ఇటురారా’ అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. మొత్తం స్కిట్ చూడాలంటే ఈ దిగువన ఉన్న వీడియోను చూసేయండి మరి.
ఇవీ చదవండి
Tags :