అడ్డంకులను అధిగమించాలి: మానుషి చిల్లర్
‘అమ్మాయిలంతా మానసిక అడ్డంకులు అధిగమించడానికి సిద్ధంగా ఉండాలని’’ చెబుతోంది, మాజీ మిస్ వరల్డ్ - బాలీవుడ్ నటి మానుషి చిల్లర్. తాజాగా ఆమె సమానత్వంపై అవగాహన పెంపొందించడానికి స్క్వాష్ ఏష్ దీపికా పల్లికల్, బాక్సింగ్ ప్రాడిజీ నిఖాత్ జరీన్లో కలిసి సమావేశం అయ్యారు.
ముంబయి: ‘అమ్మాయిలంతా మానసిక అడ్డంకులు అధిగమించడానికి సిద్ధంగా ఉండాలని’’ చెబుతోంది, మాజీ మిస్ వరల్డ్ - బాలీవుడ్ నటి మానుషి చిల్లర్. తాజాగా ఆమె సమానత్వంపై అవగాహన పెంపొందించడానికి స్క్వాష్ ఏష్ దీపికా పల్లికల్, ఇండియన్ బాక్సర్ నిఖాత్ జరీన్లో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మానుషి మాట్లాడుతూ..‘‘మానసిక, శారీరక సమస్యలు అధిగమించడానికి అమ్మాయిలంతా ఎల్లప్పుడూ సిద్ధంగా, సానుకూలంగా ఉండాలి. జీవితం పట్ల సానుకూల వైఖరిని పెంపొందించుకోవడం కోసం మహిళల విజయాల్ని చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ‘మేక్ ఏ మూవ్’ పేరుతో ఈ ప్రచారాన్ని దేశమంతటా ఉన్న యువతుల దగ్గరకు చేర్చి, వారి ఆశయాల్ని, కలలను ప్రేరేపించాలి. శారీరక, సాంస్కృతిక, మానసిక అవరోధారాలు ఉన్నప్పటికీ, సమానత్వ ఉద్యమం వారి జీవితంలో ఓ భాగమని చాటడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల కథలను విస్తృతంగా ప్రచారం చేయాలి. ఇలాంటి ప్రచారమే యువతలు విజేతలు అయ్యేలా చేస్తుందని’’ తెలిపారు.
ప్రస్తుతం మానుషి చిల్లర్ - అక్షయ్ కుమార్‌తో కలిసి ‘పృథ్వీరాజ్’ అనే చిత్రంలో నటిస్తోంది. చంద్రప్రకాష్ ద్వేవేది చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గత ఏడాది కోవిడ్ మహమ్మారిపై ఎలా పోరాడాలి అనే అంశంపై మాజీ అందాల భామలైన ప్యూర్టో రికోకు చెందిన స్టెఫానీ డెల్ వల్లే (మిస్ వరల్డ్ 2016) మెక్సికో నుంచి వెనెస్సా పోన్స్ (మిస్ వరల్డ్ 2018) భారతదేశం నుంచి మానుషి చిల్లర్ (మిస్ వరల్డ్ 2017) పాల్గొని తమవంతు కృషి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్‌బర్గ్ గాలం?