Bollywood: బాలీవుడ్‌లో ప్రతిభ కన్నా.. ఇంటిపేర్లకే ప్రాధాన్యత: వివేక్‌ ఒబెరాయ్‌

బాలీవుడ్‌లో ప్రతిభ కంటే.. ఇంటిపేర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబేరాయ్‌ అన్నారు. చాలా కాలంగా బాలీవుడ్‌లో నటుడిగా కొనసాగుతున్నా.. తన ప్రయాణం ఎంతో కష్టంగా ఉండేదని చెప్పారు. తాజాగా ఆయన నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’ 3వ సీజన్‌ విడుదలైంది. ఈ సందర్భంగా

Published : 06 Dec 2021 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌లో ప్రతిభ కంటే.. ఇంటిపేర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని నటుడు వివేక్‌ ఒబేరాయ్‌ అన్నారు. చాలా కాలంగా బాలీవుడ్‌లో నటుడిగా కొనసాగుతున్నా.. తన ప్రయాణం ఎంతో కష్టంగా ఉందని చెప్పారు. తాజాగా ఆయన నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’ 3వ సీజన్‌ విడుదలైంది. క్రీడానేపథ్యంలో సాగే ఈ వెబ్‌సిరీస్‌ మొదటి రెండు సీజన్లు బ్లాక్‌బాస్టర్‌ హిట్‌గా నిలిచాయి. దీంతో మూడో సీజన్‌ను కూడా వీక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన బాలీవుడ్‌లో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ‘సినిమా పరిశ్రమ యువ ప్రతిభను పెంచిపోషించే ఒక వ్యవస్థను అభివృద్ధి చేసుకోలేకపోయింది. బాలీవుడ్‌ని ఒక ఎక్స్‌క్లూజివ్‌ క్లబ్‌గా మార్చేశారు. అందులోకి రావాలంటే ఇంటిపేరు ప్రముఖులదై ఉండాలి లేదా ప్రముఖులు ఎవరైనా తెలిసి ఉండాలి లేదా ఎవరో ఒకరి గ్రూప్‌లో చేరాలి. వారికి మాత్రమే బాలీవుడ్‌లో ప్రాధాన్యత ఉంటుంది. అంతేకానీ.. ప్రతిభ అవసరం లేదు. ఇలాంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం’ అని వివేక్‌ చెప్పారు. తన వరకు వీలైనంతగా కొత్తవారిని ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలుస్తున్నానని చెప్పుకొచ్చారు. 

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని