India Lockdown: ‘ఇండియన్ లాక్‌డౌన్’.. టీజర్ చూశారా?
కరోనా నాటి వాస్తవ పరిస్థితులను ప్రతింబింబిచేలా వస్తున్న చిత్రం ‘ఇండియన్ లాక్‌డౌన్’. మధుర్ భండార్కర్ దర్శకుడు.
ఇంటర్నెట్‌డెస్క్: కరోనా ఈ పేరు వినపడితేనే యావత్ ప్రపంచం వణికిపోయిన రోజులున్నాయి. ఎంతో మంది ఆత్మీయులను, ఆప్తులను ఈ మహమ్మారి పొట్టన పెట్టుకుని, ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. కరోనా నాటి వాస్తవ పరిస్థితులను ప్రతింబింబించేలా వస్తున్న చిత్రం ‘ఇండియన్ లాక్‌డౌన్’ (India Lockdown). మధుర్ భండార్కర్ దర్శకుడు. శ్వేత బసు ప్రసాద్, ప్రతీక్ బబ్బర్, సాయి తమంకర్, ప్రకాశ్ బెలవాడి, అహన్‌కుమ్రాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మంగళవారం ఈ చిత్ర టీజర్ విడుదలైంది. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? వలస కూలీలు అనుభవించిన వేదన ఏంటి? వేశ్యవృత్తి వారిపై కరోనా ప్రభావం ఎలా పడింది? ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలను మధుర్ భండార్కర్ ఇందులో చూపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ జీ5 వేదికగా డిసెంబరు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amaravati: కాగ్ నివేదికలు వైకాపా అసమర్థ పాలనకు నిదర్శనం: ఎమ్మెల్సీ అశోక్‌బాబు
-
Kharge: మహిళా రిజర్వేషన్ల బిల్లు.. అది భాజపా గారడీనే: ఖర్గే
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?
-
Crime news మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. కస్టడీ నుంచి పారిపోయేందుకు నిందితుడి యత్నం!
-
Janasena: తెదేపాతో కలిసి సమస్యలపై పోరాడాలి: నాదెండ్ల మనోహర్
-
Social Look: నజ్రియా వెకేషన్.. నయన్ సెలబ్రేషన్స్..!