Updated : 23 Sep 2022 07:10 IST

Indian 2: సేనాపతి.. తిరిగొచ్చారు

కమల్‌హాసన్‌ (Kamal Haasan) కథానాయకుడిగా శంకర్‌ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘భారతీయుడు 2’ (Indian 2). లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థలు సంయ్తుంగా నిర్మిస్తున్నాయి. కాజల్‌ అగర్వాల్‌ (kajal), రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), సిద్ధార్థ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా గురువారం చెన్నైలో పునఃప్రారంభమైంది. ఈ సందర్భంగా సెట్లో శంకర్‌తో కలిసి ఉన్న ఫొటోలతో పాటు చిన్న వీడియో క్లిప్‌ను కమల్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆయన పోస్ట్‌ను చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ రీట్వీట్‌ చేస్తూ.. ‘మా సేనాపతి తిరిగొచ్చేశార’ని పేర్కొంది. ఈ కొత్త షెడ్యూల్‌లో భాగంగా కమల్‌, కాజల్‌లతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని సమాచారం.


అజిత్‌ అదుర్స్‌

కథానాయకుడు అజిత్‌ (Ajith) కొత్త లుక్‌లో సందడి చేస్తున్నారు. దర్శకుడు హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘తునివు’ (Thunivu). ‘నో గట్స్‌ నో గ్లోరీ’ అనేది ఉపశీర్షిక. ‘మాస్‌+ క్లాస్‌’ అంటూ అజిత్‌ కొత్త పోస్టర్‌ను చిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. చివరి షెడ్యూల్‌ మినహా సినిమా చిత్రీకరణ పూర్తయింది. చివరి షెడ్యూల్‌ను బ్యాంకాక్‌లో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘నెర్కొండ పార్వాయి’, ‘వలిమై’ చిత్రాల తర్వాత అజిత్‌, వినోద్‌ కలయికలో వస్తున్న మూడో చిత్రం కావడంతో మంచి అంచనాలే ఉన్నాయి.Telugu 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని