Indian 2: తిరుపతిలో భారతీయుడు 2

అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan), దర్శకుడు శంకర్‌ కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం ‘భారతీయుడు 2’. కాజల్‌ అగర్వాల్‌, సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated : 02 Feb 2023 07:15 IST

గ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan), దర్శకుడు శంకర్‌ (Shankar) కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం ‘భారతీయుడు 2’ (Indian 2). కాజల్‌ అగర్వాల్‌, సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తాజా షెడ్యూల్‌ షూటింగ్‌ కోసం బుధవారం ఏపీలోని గండికోటకు చేరుకున్నారు కమల్‌హాసన్‌. ముందు తిరుపతి వచ్చి అక్కడ్నుంచి హెలిక్యాప్టరులో గండికోట వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలను చిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు అందిస్తున్నారు. రత్నవేలు, రవివర్మన్‌ ఛాయాగ్రాహకులు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు