Ram Charan: రామ్‌చరణ్‌ ఇంట క్రికెటర్ల సందడి.. ఫొటో వైరల్‌

సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులకు ఆతిథ్యమిచ్చి, ఘనంగా సత్కరించడంలో మెగాస్టార్‌ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొన్న నటుడు రామ్‌చరణ్‌....

Published : 26 Sep 2022 10:31 IST

హైదరాబాద్‌: సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులకు ఆతిథ్యమిచ్చి.. ఘనంగా సత్కరించడంలో మెగాస్టార్‌ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొన్న నటుడు రామ్‌చరణ్‌ ఇప్పుడిదే సంప్రదాయాన్ని కొనసాగించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ నిమిత్తం హైదరాబాద్‌కు విచ్చేసిన భారత క్రికెటర్ల కోసం చరణ్‌ ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశాడు. ఉప్పల్‌ మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం హార్దిక్‌పాండ్య, సూర్యకుమార్‌ యాదవ్‌తోపాటు పలువురు ఆటగాళ్లు చరణ్‌ ఇంటికి చేరుకొని సందడి చేశారు.

ఈ సందర్భంగా ఆటగాళ్లను సన్మానించి.. చరణ్‌ వారితో కాసేపు సరదాగా మాట్లాడాడు. రామ్‌చరణ్‌ - ఉపాసన దంపతులతోపాటు మెగా కుటుంబసభ్యులు, పలువురు సెలబ్రిటీలు సైతం ఈ పార్టీలో పాల్గొన్నారని... త్వరలోనే ఈ పార్టీ ఫొటోలను చరణ్‌ అధికారికంగా షేర్‌ చేయనున్నారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు, హార్దిక్‌ పాండ్య.. రామ్‌చరణ్‌ నివాసంలోని ఓ వ్యక్తితో దిగిన  ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక, సినిమాల విషయానికి వస్తే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రామ్‌ చరణ్‌.. శంకర్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. పొలిటికల్, సామాజిక అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇందులో చరణ్‌ విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని