NBK 107: బాలయ్య సినిమాలో ఇండో ఆస్ట్రేలియన్‌ భామ

నందమూరి బాలకృష్ణ - గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో ఓ మాస్‌ ఎంటర్‌టైనర్‌ సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. NBK 107 వర్కింగ్‌ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకుంటోన్....

Published : 18 May 2022 13:08 IST

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ - గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో ఓ మాస్‌ ఎంటర్‌టైనర్‌ సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. NBK 107 వర్కింగ్‌ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈచిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం ఇండో ఆస్ట్రేలియన్‌ భామ, ‘చీకటి గదిలో..’ ఫేమ్‌ చంద్రికా రవి రంగంలోకి దిగింది. వాస్తవిక కథాంశాలతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ కోసం చిత్రబృందం ఆమెను ఎంపిక చేసింది. మొదట ఈ పాట కోసం డింపుల్‌ హయాతిని ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చినప్పటికీ, చంద్రికను ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది. NBK107లో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందంటూ చంద్రిక తాజాగా ఓ పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ హైదరాబాద్‌ రామోజీ ఫిలింసిటీలో కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ సారథ్యంలో జరుగుతోంది. మరోవైపు సెట్‌లో బాలయ్య, గోపీచంద్‌లతో దిగిన ఫొటోని తమన్‌ షేర్‌ చేశారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈసినిమాలో శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని