Sonam Kapoor: లండన్‌లో సోనమ్‌ కపూర్‌ సీమంతం

బాలీవుడ్‌ నటి సోనమ్‌కపూర్‌ త్వరలో తల్లి కానున్న సంగతి తెలిసిందే. పుట్టబోయే బేబీ కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ఆమె ఇప్పటికే పలు సందర్భాల్లో....

Published : 16 Jun 2022 12:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ నటి సోనమ్‌కపూర్‌ త్వరలో తల్లి కానున్న సంగతి తెలిసిందే. పుట్టబోయే బేబీ కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ఆమె ఇప్పటికే పలు సందర్భాల్లో తెలిపారు. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలనూ ఆమె తరచూ సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేస్తున్నారు. కాగా, తాజాగా సోనమ్‌కపూర్‌ బేబీ షవర్‌ వేడుక లండన్‌లో జరిగింది. కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సోనమ్‌-ఆనంద్‌ దంపతుల స్నేహితులు పాల్గొన్నారు. సోనమ్‌ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఈ వేడుకల్లో పలువురు విదేశీ సింగర్స్ పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను లియో కల్యాణ్‌ అనే సింగర్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేయగా అవి చూసిన నెటిజన్లు, సెలబ్రిటీలు సోనమ్‌కు విషెస్‌ తెలుపుతున్నారు.

‘సావరియా’ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన సోనమ్‌ కపూర్‌ వరుస ప్రేమ కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ‘దిల్లీ-6’, ‘బాంబే టాకీస్‌’, ‘ప్రేమ రతన్‌ ధన్‌ పాయో’, ‘నీర్జా’, ‘సంజు’ చిత్రాలు సోనమ్‌కు గుర్తింపు తెచ్చిపెట్టాయి. నటిగా రాణిస్తున్న తరుణంలోనే ఆమె వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాతో ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో ఈ జంట 2018లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు కొద్దిగా దూరంగా ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని