
గాయకుడు సిద్ శ్రీరామ్‌కు అవమానం
జూబ్లీహిల్స్: గాయకుడు సిద్ శ్రీరామ్‌కు హైదరాబాద్‌లో అవమానం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇటీవల ఆయన జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 10లోని సన్‌బర్న్ పబ్‌లో నిర్వహించిన వేడుకకు హాజరయ్యారు. కార్యక్రమానికి సిద్ శ్రీరాం వస్తుండటంతో నిర్వాహకులు టిక్కెట్లు అడ్డగోలుగా అమ్మేశారు. కేవలం 500 మంది లోపు సరిపోయే ఈ ప్రాంగణంలో వందలాది మంది వచ్చారు. సిద్ శ్రీరాం ఒకవైపు తన బ్యాండ్‌తో కలిసి పాటలు పాడుతుండగా పై నుంచి కొందరు ఆకతాయిలు మద్యంతోపాటు నీళ్లు చల్లారు. ఆయా బృంద సభ్యులపై అవి పడటంతో కార్యక్రమం మధ్యలోనే నిలిపారు. ఇలాంటి వాటికి తగ్గేదిలేదంటూ తన పాటలను కొనసాగించారు. అనంతరం తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ.. ‘‘మనసును అదుపులో పెట్టుకొంటే పనిచేసే ప్రాంతంలో భయం ఉండదంటూ’’ ట్వీట్ చేశారు. అయితే ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని జూబ్లీహిల్స్ పోలీసులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ పోలీసు అధికారుల పాత్రపై పలు ఆరోపణలు వస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.