LV Prasad: ఇండియాలో ఆ ఘనత సాధించిన నటుడు ఎల్వీ ప్రసాద్‌ ఒక్కరే!

తెలుగు సినిమా దిగ్గజం, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎల్వీ ప్రసాద్‌ (LV Prasad) దర్శకుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఈ తరానికీ సుపరిచితమే. ఆయన జీవిత పుస్తకాన్న....

Published : 24 Jun 2022 01:41 IST

ఇంటర్నెడెస్క్‌: తెలుగు సినిమా దిగ్గజం, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎల్వీ ప్రసాద్‌ (LV Prasad) దర్శకుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా పేరుపొందారు. ఆయన జీవిత పుస్తకాన్ని తెరిచి చూస్తే మొత్తం విశేషాలమయమే. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన, అంచెంలంచెలుగా ఎదిగి, నటుడిగా, సహాయదర్శకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో విజయాలు అందుకున్నారు. ఇన్ని ఘనతలు సాధించిన ఆయన నటుడిగా ఎవరూ సాధించని ఒక రికార్డును నెలకొల్పారు. అది ఏంటంటే హిందీ తొలి చిత్రం ‘ఆలం అరా’(Alam ara) (1931), తమిళ తొలి చిత్రం ‘కాళిదాస్’ (Kalidas) (1932), తొలి తెలుగు చిత్రం ‘భక్త ప్రహ్లాద’ (Bhakta Prahlada) (1932) ఇలా మూడు భాషల మొదటి చిత్రాల్లో నటించిన ఏకైక నటుడిగా రికార్డు సాధించారు. ఇలా ఎప్పటికి నిలిచి ఉండే రికార్డును సాధించిన తెలుగు నటుడిగా ఎల్వీ ప్రసాద్‌ చరిత్రలో నిలిచిపోయారు. ఇందులో తొలి తమిళ, తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన హెచ్‌ఎం రెడ్డి కూడా తెలుగు వారే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని