‘లగాన్‌’ను నిర్మించలేమని చేతులెత్తేస్తే..!

భారతీయుల ఆత్మగౌరవానికి, బ్రిటిష్‌ దొరల అహంకారానికి మధ్య జరిగిన కథగా ఆద్యంతం హృదయాల్ని తాకేలా తెరకెక్కిన చిత్రం ‘లగాన్‌’. మూడేళ్ల పాటు పన్నుల నుంచి మినహాయింపు పొందడానికి మనదేశంలోని ఓ ప్రాంతానికి చెందిన కొందరు ఓ టీమ్‌గా ఏర్పడి

Published : 24 Sep 2022 12:47 IST

భారతీయుల ఆత్మగౌరవానికి, బ్రిటిష్‌ దొరల అహంకారానికి మధ్య జరిగిన కథగా ఆద్యంతం హృదయాల్ని తాకేలా తెరకెక్కిన చిత్రం ‘లగాన్‌’ (Lagaan). మూడేళ్ల పాటు పన్నుల నుంచి మినహాయింపు పొందడానికి మనదేశంలోని ఓ ప్రాంతానికి చెందిన కొందరు ఓ టీమ్‌గా ఏర్పడి తెల్లవాళ్లతో క్రికెట్‌ ఆడి గెలిచిన తీరుకి ప్రేక్షకుల నీరాజనం పట్టారు. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమాని నిర్మించడానికి మొదట్లో ఎవరూ ముందుకు రాలేదంటే ఆశ్చర్యం వేయక మానదు. చిత్ర దర్శకుడు అశుతోష్‌ గోవారికర్‌ ఈ సినిమా కథని పలువురు నిర్మాతలకు వినిపిస్తే చాలా బాగుంది కానీ నిర్మించలేము అని చేతులెత్తేశారట. కథని గోవారికర్‌ ఎంత బలంగా నమ్మారో...ఆమిర్‌ (Aamir Khan) కూడా అంతే విశ్వసించారు. దాంతో ఆయనే తన ‘ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌’లో తొలి చిత్రంగా దీన్ని నిర్మించారు. ఈ సినిమా కోసం గోవారికర్‌ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఆయన ఓ రోజు షూటింగులో గాయాల పాలై మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి ఏర్పడింది. అయినాసరే సినిమా ఆగకూడదని గోవారికర్‌ తన మానిటర్‌ పక్కనే ప్రత్యేకంగా ఓ బెడ్‌ను ఏర్పాటు చేయించుకొని చిత్రీకరణను కొనసాగించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. అప్పటి వరకూ ఏ భారతీయ చిత్రానికి పనిచేయనంత ఎక్కువమంది బ్రిటిష్‌ నటులు ఈ సినిమా కోసం పనిచేయడం మరో విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని