The Warriorr: మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌తో సెట్‌ కాలేదు.. రామ్‌తో కుదిరింది

తమిళ దర్శకుడు- తెలుగు నటుడు, తెలుగు హీరో, తమిళ డైరెక్టర్‌.. ప్రస్తుతం ఈ కాంబినేషన్‌లో సినిమాలు విరివిగా తెరకెక్కుతున్నాయి. ప్రేక్షకుల్లో భారీ అంచనాలకు తెరలేపుతున్నాయి. ఈ జాబితాలోకే వస్తుంది ‘ది వారియర్‌’. టాలీవుడ్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా కోలీవుడ్‌ డైరెక్టర్‌ రూపొందించిన చిత్రమిది.

Published : 11 Jul 2022 10:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమిళ దర్శకుడు - తెలుగు కథానాయకుడు, తెలుగు హీరో - తమిళ డైరెక్టర్‌.. ప్రస్తుతం ఈ కాంబినేషన్‌లో సినిమాలు విరివిగా తెరకెక్కుతున్నాయి. ప్రేక్షకుల్లో భారీ అంచనాలకు తెరలేపుతున్నాయి. ఈ జాబితాలోకే వస్తుంది ‘ది వారియర్‌’ (The Warriorr). టాలీవుడ్‌ స్టార్‌ రామ్‌ (Ram Pothineni) హీరోగా కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామి (Lingusamy) రూపొందించిన చిత్రమిది. జులై 14న విడుదలకాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలు చూద్దాం..

  1. మాధవన్‌ ‘రన్’, విశాల్‌ ‘పందెంకోడి’, కార్తీ ‘ఆవారా’ తదితర డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగులో మంచి మార్కెట్‌ సృష్టించుకున్న లింగుస్వామి ఇక్కడ నేరుగా తెరకెక్కించిన తొలి సినిమా ‘ది వారియర్‌’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందింది.
  2. దర్శకుడిగా సుమారు 23 ఏళ్ల కెరీర్‌లో లింగుస్వామి తెరకెక్కించిన చిత్రాలు 10 (వారియర్‌తో కలిపి). నేరుగా తెలుగు సినిమా చేయాలని ఆయనెప్పుడో అనుకొన్నారు. ఈ మేరకు మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌లతో కథపై చర్చలు జరిపారు. కానీ, అవి సెట్‌ కాలేదు. చివరకు రామ్‌తో ఈ ‘ది వారయర్‌’ కుదిరింది.
  3. సూర్య ‘సికిందర్‌’, విశాల్‌ ‘పందెంకోడి 2’ చిత్రాలతో ఇటీవల పెద్దగా మెప్పించలేకపోయిన లింగుస్వామి ‘ది వారియర్‌’పై ఆశలు పెట్టుకొన్నారు. ‘ఈ చిత్రం విడుదల తర్వాత రామ్‌ పేరు ప్రతి చోటా రీసౌండ్‌తో వినిపిస్తుంది’ అని లింగుస్వామి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (తమిళ వెర్షన్‌)లో అన్నారు.
  4. ఈ ముందుస్తు విడుదల వేడుకకు దిగ్గజ దర్శకులు రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకే వేదికపై అంతమంది స్టార్ డైరెక్టర్లను చూసేందుకు ప్రేక్షకులకు రెండు కళ్లు చాల్లేదంటే అతిశయోక్తి కాదేమో. భారతీ రాజా, శంకర్‌, మణిరత్నంతోపాటు ఎస్‌.జె. సూర్య, శివ, కార్తీక్‌ సుబ్బారాజు, వెట్రిమారన్‌ హీరోలు విశాల్‌, ఆర్య తదితరులు ఈవెంట్‌లో పాల్గొన్నారు.
  5. కథానాయకుడు రామ్‌, కథానాయిక కృతిశెట్టి ఈ సినిమాతోనే కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రామ్‌కి ఇది 19వ చిత్రంకాగా కృతికి 4వ సినిమా. తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు రామ్‌ దాదాపు 15 ఏళ్లు ఎదురుచూశారు. ఈ సినిమాలో రామ్‌ ‘సత్య ఐపీఎస్‌’గా కనిపించనున్నారు. రామ్‌ పోలీసు పాత్ర పోషించిన తొలి సినిమా ఇదే.
  6. విలన్‌ ‘గురు’గా ఆది పినిశెట్టి నటించారు. అందాల భామ అక్షరగౌడ ఓ కీలక పాత్ర పోషించారు.
  7. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌- రామ్‌ కాంబినేషన్‌కున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ‘జగడం’తో ప్రారంభమైందీ వీరి ప్రయాణం. ‘రెడీ’, ‘శివమ్‌’, ‘నేను.. శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురు ప్రేమ కోసమే’ అనంతరం ‘ది వారియర్‌’తో శ్రోతలను ఉర్రూతలూగించారు. ఇందులోని ‘బుల్లెట్‌’ పాటను తమిళ నటుడు శింబు ఆలపించడం విశేషం.
  8.  ‘ఒక్కడు’, ‘సరిలేరు నీకెవ్వరు’ తదరిత సినిమాల్లోకి యాక్షన్‌ సన్నివేశాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన ‘కొండారెడ్డి బురుజు’ ఇందులోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
  9.  ‘‘తెలుగు ప్రేక్షకుల ఉత్సాహాన్ని.. ప్రేమని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. నేరుగా తెలుగు సినిమా చేయాలనుకున్నా. అది ఈ చిత్రంతో కుదరడం ఆనందంగా ఉంది. ఈ సంస్థలోనే ‘ది వారియర్‌ 2’ చేస్తా’’ అని లింగుస్వామి ఇటీవల సీక్వెల్ ప్రకటించారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని