Titanic: ‘టైటానిక్‌’కు 11 ఆస్కార్‌లు వచ్చాయి కానీ..

టైటానిక్‌... ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల మనసు దోచిన సినిమా. ఓడ ముందు భాగంలో జాక్‌..రోజ్‌లు ఇద్దరూ ఒకరివెనుక ఒకరు చేతులు చాపి నిల్చున్న సన్నివేశం ప్రేక్షకుల మదిలో బలంగా నాటుకుపోయింది.

Published : 19 Sep 2022 15:58 IST

ఔను.. నిజమే!

టైటానిక్‌... ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల మనసు దోచిన సినిమా. ఓడ ముందు భాగంలో జాక్‌..రోజ్‌లు ఇద్దరూ ఒకరివెనుక ఒకరు చేతులు చాపి నిల్చున్న సన్నివేశం ప్రేక్షకుల మదిలో బలంగా నాటుకుపోయింది. ఈ చిత్రంలో ఇలాంటి ఎన్నో సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. వెండితెర మర్చిపోలేని ఓ విషాద ప్రేమ కథగా జేమ్స్‌ కామెరూన్‌ ఈ చిత్రాన్ని మలిచిన తీరుకి ప్రపంచం ఫిదా అయ్యింది. వసూళ్ల పరంగా ఎన్నో రికార్డులు నెలకొల్పింది. జాక్‌గా లియోనార్డో డికాప్రియో..రోజ్‌గా కేట్‌ విన్స్‌లెట్‌ నటన ఇప్పటికీ కళ్లముందు కదులుతూనే ఉంటుంది. అంత అద్భుతంగా నటించారు ఈ ఇద్దరూ. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు అందుకున్నారు. ఈ ఇద్దరే కాదు చిత్రంలోని అన్ని పాత్రలూ గుర్తుండిపోతాయి. ఈ చిత్రానికి ఆస్కార్‌ పంట పండటం ఖాయమని..ముఖ్యంగా నటనకు పురస్కారాలు కచ్చితంగా వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఈ సినిమా 11 విభాగాల్లో ఆస్కార్‌లు గెలుచుకుంది. కానీ నటనకు సంబంధించిన ఒక్క అవార్డు రాలేదు. ఉత్తమ నటిగా కేట్‌ విన్స్‌లెట్‌, ఉత్తమ సహాయ నటిగా గ్లోరియాలు నామినేషన్లు మాత్రం దక్కించుకున్నారు. టైటానిక్‌ సినిమా మరికొన్ని నెలల్లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని