RRR: అప్పుడు తాత-తండ్రి.. ఇప్పుడు మనవడు-కొడుకు..!
నందమూరి, మెగా కాంబోలో వచ్చిన చిత్రాలేంటో తెలుసా..?
ఆసక్తికరమైన కాంబినేషన్ గురించి తెలుసా..
ఇంటర్నెట్ డెస్క్: అగ్ర కథానాయకులు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటిస్తారా? అనే సినీ అభిమానుల సందేహానికి ‘రౌద్రం రణం రుధిరం’ (RRR) సినిమాతో దర్శకుడు రాజమౌళి సమాధానమిచ్చారు. సమాన స్థాయి అభిమానగణం ఉన్న హీరోలను ఒకే ‘తెర’పైకి తీసుకొచ్చారు. వీరిని ఒకే ఫ్రేమ్‌లో చూడాలని సగటు ప్రేక్షకుడితోపాటు సినీ ప్రముఖులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరే కాదు.. గతంలో సీనియర్ ఎన్టీఆర్- చిరంజీవి కాంబోలో ఓ చిత్రం తెరకెక్కింది. ఆ వివరాలివీ..
ఆయన రాజా.. ఈయన కిశోర్
సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి కలిసి నటించిన సినిమా ‘తిరుగులేని మనిషి’. న్యాయవాది రాజాగా ఎన్టీఆర్, క్లబ్‌ల్లో పాటలు పాడే కిశోర్‌గా చిరంజీవి నటించారు. రతి అగ్నిహోత్రి, జయలక్ష్మి, సత్యనారాయణ, జగ్గయ్య, అల్లు రామలింగయ్య, ముక్కామల, చిడతల అప్పారావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. కథేంటంటే.. రాజా తిరుగులేని న్యాయవాది. ప్రాక్టీస్ ప్రారంభంలోనే శభాష్ అనిపించుకుంటాడు. తన సోదరి పద్మ (జయలక్ష్మి) కిశోర్‌ను ప్రాణంగా ప్రేమిస్తుంది. ఈ వ్యవహారం రాజా తండ్రి శశిభూషణ రావు (జగ్గయ్య)కు నచ్చదు. కిశోర్‌కు ఆస్తిపాస్తులు లేని కారణంగా వారి పెళ్లిని తిరస్కరిస్తాడు. దాంతో.. పద్మ ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటుంది. సకాలంలో ఆమెను రక్షించి, తండ్రికి తెలియకుండా కిశోర్‌తో వివాహం చేస్తాడు రాజా.
ఒకానొక సమయంలో.. తన తండ్రికి వజ్రాల అక్రమ రవాణా చేసే వారితో సంబంధముందని తెలుసుకున్న రాజా దిగ్భ్రాంతికి గురవుతాడు. తండ్రి మరణానికి కారకులెవరో తెలుసుకునే ప్రయత్నంలో తన బావమరిది కిశోర్‌కూ ఈ ముఠాతో సంబంధం ఉందని తెలుసుకుని షాక్ అవుతాడు. చిరంజీవి నెగెటివ్ రోల్ పోషించారనే ఈ ట్విస్ట్ సినిమాకే కీలకం. ఆ తర్వాత రాజా మాటలతో కిశోర్ మనసు మార్చుకుంటాడు. ఇద్దరు కలిసి స్మగ్లర్ల గుట్టు రట్టు చేస్తారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ఎవరో కాదు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. దేవీ వరప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కేవీ మహదేవన్ సంగీతం అందించారు. ఈ చిత్రం 1981 ఏప్రిల్ 1న విడుదలైంది.
వారిది బంధుత్వం.. వీరిది స్నేహం:
సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి బావాబావమరిదిగా కనిపించగా.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ‘ఆర్ఆర్ఆర్’లో స్నేహితులుగా కనిపించనున్నారు. నిప్పు (అల్లూరి సీతారామరాజు- చరణ్), నీరు (కొమురం భీమ్- తారక్) దోస్తీ ఎలా ఉంటుందో చూపించబోతున్నారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఆ కాంబోలో కుదరలేదు.. కానీ:
బాలకృష్ణ, చిరంజీవి కాంబినేషన్లో సినిమా తెరకెక్కించాలని పలువురు దర్శకులు ప్రయత్నించినా సాధ్యపడలేదు. తెరపైనా ఈ ఇద్దరు కనిపించకపోయినా తెరవెనక ఎంతో స్నేహంగా ఉంటారు. బాలకృష్ణ నటించిన ఓ సినిమాను చిరంజీవి ప్రమోట్ చేశారు. ఆ సినిమా ఏదో కాదు ‘ఆదిత్య 369’. 1991 జులై 18న ఈ సినిమాను ఎక్కువ మంది ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఓ ప్రముఖ టీవీ ఛానల్లో యాడ్స్ వేయాలని ప్లాన్ చేశారట. ఈ క్రమంలో చిరుతో ప్రచారం చేయిస్తే ఇంకా బాగుంటుందని భావించి.. ఆయన్ను సంప్రదించారట. అడిగిన వెంటనే చిరంజీవి ఓకే చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
సీనియర్ హీరోయిన్ల జోరు ‘తగ్గేదే లే’.. ఎవరెన్ని సినిమాలతో బిజీగా ఉన్నారంటే?
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లపై ప్రత్యేక కథనం. త్రిష, నయనతార, తమన్నా.. ఇలా ఎవరెవరు ఎన్ని సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే? -
పృథ్వీరాజ్ సుకుమారన్ బెస్ట్ మూవీస్.. ఇప్పుడు ‘ఆడుజీవితం’.. ఇంతకుముందు?
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఉత్తమ చిత్రాలు ఏంటంటే..? -
ఆ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిని నేనే అని తెలిసి షాకయ్యా.. అల్లు అర్జున్
నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు. -
రికార్డుల్లోనూ ఫస్టే ఈ నేషనల్ క్రష్.. రష్మిక ఖాతాలో ఘనతలెన్నో!
రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె సొంతంచేసుకున్న కొన్ని రికార్డులను చూద్దాం.. -
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్‌టాపిక్‌గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్‌డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్‌ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది? -
Jeethu Joseph: 17 సినిమాలు.. మూడే ఫ్లాప్‌లు.. చైనీస్, ఇండోనేషియా, కొరియాలోనూ రీమేక్ అయిన మొదటి భారతీయ సినిమా ఆయనదే!
Jeethu Joseph: మోహన్‌లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘నెరు’ ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో జీతూ గురించి ఆసక్తికర విషయాలు.. -
Chiranjeevi: ఆ అవమానమే.. సుప్రీం హీరోను మెగాస్టార్ చేసింది: పద్మ విభూషణ్ చిరంజీవి ప్రయాణమిది!
ప్రముఖ నటుడు చిరంజీవికి అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మ విభూషణ్’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం..
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
2026 నాటికి ఎయిర్‌ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!