Kalki 2898 AD: ‘కల్కి’ మూవీకి వెళ్తున్నారా? ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

Interesting Facts Kalki 2898 AD: ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ విడుదల కానున్న నేపథ్యంలో ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు..

Updated : 27 Jun 2024 11:30 IST

Interesting Facts Kalki 2898 AD: ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పురాణాలను భవిష్యత్‌ను కలుపుతూ ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్ అశ్విన్‌ రూపొందించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జూన్‌27న(Kalki Release Date) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ‘కల్కి’ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు (Unknown Facts about Kalki 2898 AD) ఉన్నాయి. అవేంటో చదివేయండి..

 • భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) నిలిచిందని ట్రేడ్‌ వర్గాల అంచనా. ఈ మూవీ వ్యయం (Kalki Movie Budget) రూ.600 కోట్లు దాటింది. నటీనటులు వేతనాలు, సెట్స్‌కు అయిన ఖర్చుతో పోలిస్తే, నాణ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించే ఉద్దేశంతో అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌ కోసం భారీగా ఖర్చు చేశారు.
 • ఈ మూవీ (Kalki Telugu Movie)లో అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌, సుప్రీం యాస్కిన్‌గా ప్రతినాయకుడి పాత్రలో కమల్‌హాసన్‌ నటిస్తున్నారు. దాదాపు 40ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించడం విశేషం. 1985లో వచ్చిన ‘గిరాఫ్తార్’లో నటించారు. ప్రయాగ్‌ రాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. ఇదే చిత్రంలో రజనీకాంత్‌ కూడా నటించడం మరో విశేషం.
 • ‘కల్కి’లో ప్రభాస్‌ (Prabhas) రైడ్‌ చేసే వెహికల్‌ను మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ టీమ్‌తో పాటు, కోయంబత్తూరులోని జయం ఆటో ఇంజినీరింగ్ సహకారం అందించారు. ఈ ఒక్క కారు కోసమే రూ.4కోట్లు ఖర్చు పెట్టారట.
 • కమల్‌హాసన్‌ ఇందులో సుప్రీం యాస్కిన్‌ పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలో ఆయన కనిపిస్తున్న లుక్‌ కోసం అనేక టెస్ట్‌లు చేశారు. చివరకు చిత్ర బృందం (Kalki Movie Team) లాస్‌ ఏంజిల్స్ వెళ్లి, హాలీవుడ్‌ సినిమాలకు పనిచేసే మేకప్‌ నిపుణులతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. 
 • అశ్వత్థామ పాత్ర పోషిస్తున్న అమితాబ్‌ (Amitabh Bachchan) వయసు 81 సంవత్సరాలు టీమ్‌లో అత్యధిక వయసు కలిగిన వ్యక్తి ఆయన. అశ్వత్థామ మేకప్‌ వేయడానికి 3గంటల సమయం పడితే తీయడానికి 2గంటలు పట్టేది. అంతేకాదు, యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం అమితాబ్‌ చాలా కష్టపడ్డారు.  ‘మనం’, ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత అమితాబ్‌ నటించిన తెలుగు చిత్రమిదే.
 • ‘కల్కి’ కథ (Kalki Story) మూడు ప్రపంచాల మధ్య సాగుతుందని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్వయంగా వెల్లడించారు. భవిష్యత్‌లో ప్రపంచమంతా వనరులను కోల్పోయిన నిర్జీవమైన దశలో కాశీ పట్టణాన్ని చూపించారు. ఇక అన్ని వనరులు కలిగి ఆకాశంలో కిలోమీటర మేర ఉండేలా కాంప్లెక్స్‌ను డిజైన్‌ చేశారు. సర్వమత శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబలను చూపించారు. వీటి అవుట్‌ లుక్‌ మొత్తం వీఎఫ్‌ఎక్స్‌ (VFX)లో చూపించారు. ఇందుకోసం దాదాపు 700 వీఎఫ్‌ఎక్స్‌షాట్స్‌ ఉపయోగించారు. ప్రైమ్‌ఫోకస్‌, డీఎన్‌ఈజీ, ది ఎంబసీ విజువల్ ఎఫెక్ట్స్‌ తదితర సంస్థలు ఈ మూవీకి పనిచేశాయి. హాలీవుడ్‌ చిత్రాలైన హ్యారీపోటర్‌, ఇంటర్‌స్టెల్లర్‌, డ్యూన్‌, బ్లేడ్‌ రన్నర్‌ వంటి భారీ హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన టీమ్‌ ‘కల్కి’ కోసం పనిచేసింది.

 • ఈ మూవీకి ‘కల్కి 2898 ఏడీ’ అని టైటిల్‌ పెట్టడం ఒక లాజిక్‌ ఉంది. మూవీ ట్రైలర్‌ (Movies Trailers)లో ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘6వేల సంవత్సరాల క్రితం కనిపించింది.. ఇప్పుడు ఆ పవర్‌ వచ్చిందంటే’ అని అంటాడు.. 2898  నుంచి 6000 సంవత్సరాలను తీసేస్తే, 3102. కృష్ణ పరమాత్మ అవతారం ముగించిన సంవత్సరం. అంటే 2898 ఏడీలో మళ్లీ శ్రీమహావిష్ణువు ‘కల్కి’గా అవతరించబోతున్నాడని అర్థం. ఈ ఆరువేల సంవత్సరాల్లో జరిగిన పరిమాణాలను కూడా టైమ్‌ ట్రావెల్‌ రూపంలో మూవీలో చూపించే అవకాశం ఉందని టాక్‌.
 • ఈ మూవీ షూటింగ్‌ (Kalki Movie Shooting) కోసం చిత్ర బృందం ఐ మ్యాక్స్‌ డిజిటల్‌ కెమెరాను వినియోగించారు. యారి అలెక్స్‌ 65, యారి డీఎన్‌ఏ లెన్స్‌ను ఉపయోగించి 6.5K రిజల్యూషన్‌లో మూవీ తీయడం వల్ల ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌కు అప్‌ స్కేలింగ్‌ ఈజీ అయింది. దీని వల్ల పిక్చర్‌ క్వాలిటీ చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ టెక్నాలజీ వాడి తీసిన తొలి భారతీయ చిత్రమిది.
 • బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాలతో అదరగొట్టిన దీపిక పదుకొణె నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం గమనార్హం.
 • అలనాటి అందాల తార శోభన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 18ఏళ్ల తర్వాత ఆమె నటిస్తున్న తెలుగు చిత్రమిదే. ఇందులో మరియం పాత్ర పోషిస్తోంది. 2006లో వచ్చిన మంచు విష్ణు ‘గేమ్‌’లో మోహన్‌బాబు భార్యగా నటించింది. 
 • నార్త్‌ అమెరికాలో ప్రీ-సేల్స్‌లోనే అత్యంత వేగంగా 3 మిలియన్‌ డాలర్లు వసూలు (Kalki Movie Collection) చేసిన చిత్రంగా నిలిచింది.
 • ‘కల్కి’ (Kalki Movie)లో కనిపించే కారులో ఉండే ఏఐ బుజ్జి పాత్రకు అగ్ర కథానాయిక కీర్తి సురేశ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించారు.
 • ప్రాజెక్ట్‌-కె పేరుతో ఫిబ్రవరి 26, 2020న వైజయంతీ మూవీస్‌ ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. అంటే ఈ మూవీ పూర్తవడానికి నాలుగేళ్ల కన్నా ఎక్కువ సమయం పట్టింది.
 • ప్రయోగాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ మూవీ కోసం కొన్నాళ్లు పనిచేశారు. తనకున్న అనుభవం మేరకు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Director Nag Ashwin)కు సలహాలు, సూచనలు చేశారు. 
 • భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రం (Kalki Movie)లో కొన్ని సర్‌ప్రైజ్‌లు కూడా ఉన్నాయి. కొందరు ముఖ్య నటులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారట. నాని, దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ తళుక్కున మెరుస్తారు.  మృణాళ్‌ ఠాకూర్‌ కూడా ఈ సినిమాలో ఉన్నారని టాక్‌. ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
 • పాన్‌ ఇండియా మూవీ (PAN India Movie)గా వస్తున్న ‘కల్కి’ వివిధ ఫార్మాట్‌లలో విడుదల కానుంది. 2D, 3D, IMAX, 4DX లోనూ విడుదల చేస్తున్నారు. విదేశాల్లో 4DXలో విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా ‘కల్కి’ (Kalki Telugu Movie) కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని