Pushpa: ‘పుష్ప 2’లో బాలీవుడ్‌ నటుడు?.. ‘పుష్ప 3’పై స్పందించిన ఫహద్‌

‘పుష్ప: ది రూల్‌’ పై రోజురోజుకి వస్తున్న కథనాలు ప్రేక్షకులకు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇటీవల, మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో కీ రోల్‌ చేస్తున్నాడనే వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది.

Updated : 19 Jul 2022 20:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa: The Rule) పై రోజురోజుకీ వస్తున్న కథనాలు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడనే వార్త సోషల్‌ మీడియాలో ఇటీవల హల్‌చల్‌ చేసింది. దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందన లేనప్పటికీ ఆ కాంబినేషన్‌పై జోరుగా ప్రచారం సాగింది. అదే తరహాలో ప్రస్తుతం మరో వార్త సినీ అభిమానుల్లో అంచనాలు పెంచుతోంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ (Manoj Bajpayee) ‘పుష్ప 2’లో ఓ కీలక పాత్రలో నటించబోతున్నారని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల, ముంబయి వెళ్లిన దర్శకుడు సుకుమార్ (Sukumar) మనోజ్‌ బాజ్‌పాయ్‌కి ‘పుష్ప’లోని పాత్ర గురించి వివరించినట్లు, ఆ పాత్రపై మనోజ్‌ ఆసక్తి చూపినట్లు వార్తలు వెలువడుతున్నాయి. మరి, ఆ అవకాశం మనోజ్‌కే దక్కుతుందా, సేతుపతికా, మరొకరికా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. మనోజ్‌ బాజ్‌పాయ్‌కి వైవిధ్యమైన శైలి ఉన్న నటుడిగా పేరుంది. ‘ఫ్యామిలీమ్యాన్‌’ వెబ్‌సిరీస్‌తో మరింత మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారాయన. తెలుగు చిత్రాలు ఆయనకు కొత్తేం కాదు. ఇంతకు ముందు అల్లు అర్జున్‌ ‘హ్యాపీ’ సినిమాలో కీలకమైన పాత్రలో, పవన్ కల్యాణ్ ‘పులి’లో ప్రతినాయకుడిగా ఆకట్టుకున్నారు.

 

మరో పుష్ప..!

ఓ వైపు ‘పుష్ప 2’పై భారీ అంచనాలు నెలకొనగా తాజాగా తెరపైకొచ్చిన ‘పుష్ప 3’ నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. ‘పుష్ప’లో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) ఓ ఇంటర్వ్యూలో ఈ ఫ్రాంఛైజీపై స్పందించారు. ‘ముందుగా ఒక్క సినిమాలోనే ‘పుష్ప’ కథ చెప్పాలనుకున్నారు దర్శకుడు సుకుమార్‌. నాకు స్క్రిప్టు వినిపించినప్పుడూ ఒకటే అన్నారు. తర్వాత, రెండు భాగాలుగా మారింది. ‘పుష్ప 3’కీ కావాల్సినంత మెటీరియల్‌ ఆయన దగ్గర ఉంది’’ అని ఫహద్‌ తెలిపారు. దీంతో ‘పుష్ప 3’ ఉందంటూ అల్లు అర్జున్‌ అభిమానులు ట్వీట్లపై ట్వీట్‌లు చేస్తున్నారు.

సుకుమార్‌ ‘పుష్ప’ కథను రెండు భాగాల్లోనే ముగిస్తారా, మరిన్ని సీక్వెల్స్‌ చేస్తారా? కాలమే సమాధానం చెప్పాలి. ‘పుష్ప 1’లో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌, పోలీసు అధికారి భన్వర్‌ సింగ్‌ షెకావత్‌గా ఫహద్‌ ఎంతటి సంచలనం సృష్టించారో తెలిసిందే. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డు నెలకొల్పింది. యూట్యూబ్‌లో 500 కోట్ల వ్యూస్‌ (మ్యూజిక్‌ ఆల్బమ్‌) సాధించిన తొలి భారతీయ సినిమాగా నిలిచింది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని