Published : 23 Jun 2022 13:21 IST

Manchu Vishnu & Prakash Raj: ఒకే వేదికపై ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు.. ఫొటోలు వైరల్‌

హైదరాబాద్‌: ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj), మంచు విష్ణు (Manchu Vishnu).. ఈ రెండు పేర్లు కలిపి వింటే గతేడాది జరిగిన ‘మా’ (MAA) ఎన్నికలే గుర్తొస్తాయి. అంతలా ఆ ఎన్నికల సమయంలో మాటల యుద్ధం జరిగింది వారి మధ్య. అయితే తాజాగా ఈ ఇద్దరూ ఓ వేదికపై కలిశారు. కాసేపు మాట్లాడుకున్నారు. ఫొటోలకు పోజులిచ్చారు. దీంతో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. దీనికి విశ్వక్‌సేన్‌ (VishwakSen) కొత్త సినిమా ప్రారంభోత్సవం వేదికైంది. ఇంతకీ ఏమైందంటే...

గతేడాది జరిగిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (MAA) ఎన్నికలకు ప్రత్యేక అధ్యాయమే ఉంది. ‘మా’ అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు పోటీపడ్డారు. ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి ఎన్నికలు పూర్తయి విష్ణు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఇరు ప్యానల్స్‌ మధ్య మాటల యుద్ధాలు జరిగాయి. వీరి మధ్య మాటల పోరు ఏ స్థాయిలో జరిగిందంటే.. చివరికి విష్ణు, ప్రకాశ్‌ రాజ్‌ మీడియా ముందుకు వచ్చి ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనే దాకా వెళ్లారు. పవన్‌ కల్యాణ్‌ విషయంలోనూ వీరిద్దరి మధ్య అప్పట్లో వాగ్వాదం జరిగింది. దీంతో వీళ్లిద్దరూ అప్పట్లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారారు. అయితే, ‘మా’ ఎన్నికలు పూర్తయిన తర్వాత విష్ణు - ప్రకాశ్‌రాజ్‌  ఒకే వేదికపై కనిపించలేదు. సినిమాలు చేసుకుంటూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు.

తాజాగా విశ్వక్‌సేన్‌ కొత్త సినిమా ప్రారంభోత్సవంలో ప్రకాశ్‌రాజ్‌ - మంచు విష్ణు కలసి కనిపించారు. అర్జున్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరగ్గా పవన్‌ కల్యాణ్‌, రాఘవేంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో పాల్గొన్న ప్రకాశ్‌రాజ్‌ - మంచు విష్ణు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అనంతరం పవన్‌ కల్యాణ్‌, ఇతర చిత్రబృందంలో కలసి ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. 

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని