Sarkaru Vaari Paata: ‘సర్కారువారి పాట’ ఈ ఆసక్తికర విషయాలు మీకోసం..

Sarkaru Vaari Paata: మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘సర్కారువారి పాట’ గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం..

Updated : 11 May 2022 20:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘కేజీయఫ్‌2’,‘ఆచార్య’ తర్వాత మరో పెద్ద చిత్రం తెలుగు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు సిద్ధమైంది. మహేశ్‌బాబు(Mahesh babu) కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారిపాట’(Sarkaru Vaari Paata). కీర్తి సురేశ్‌ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం...

* మహేశ్‌బాబు వెండితెరపై కనిపించి రెండున్నరేళ్లు దాటిపోయింది. 2020 సంక్రాంతి సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ఆయన ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత కరోనా ఎఫెక్ట్‌తో ‘సర్కారువారి పాట’(Sarkaru Vaari Paata) ఆలస్యమవుతూ వచ్చింది.

* 2020 మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ‘సర్కారువారి పాట’ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.

* మహేశ్‌బాబు-పరశురామ్‌ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం ఇది.

* తొలుత ఈ సినిమాలో కథానాయికగా కియారా అడ్వాణీ, సయీ మంజ్రేకర్‌ల పేర్లు వినిపించాయి. కానీ, చివరకు కీర్తిసురేశ్‌ను ఓకే చేశారు. మహేశ్‌తో కీర్తికి ఇది తొలి చిత్రం.

* ఇక ప్రతినాయకుడి పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలా? అన్నదానిపై చిత్ర బృందం తీవ్రంగా చర్చించింది. ఒకానొక సందర్భంగా కన్నడ నటుడు ఉపేంద్ర పేరు కూడా వినిపించింది. కానీ, రెండు షెడ్యూల్స్‌ పూర్తయిన తర్వాత సముద్రఖని ఓకే అయ్యారు.

* తమన్‌-మహేశ్‌బాబు కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో చిత్రం ‘సర్కారువారి పాట’(Sarkaru Vaari Paata). గతంలో ‘దూకుడు’, బిజినెస్‌మెన్‌,  ‘ఆగడు’ చిత్రాలకు పనిచేశారు. ఇక పరశురామ్‌తో కలిసి ‘ఆంజనేయుడు’, శ్రీరస్తు-శుభమస్తు చిత్రాలకు తమన్‌ స్వరాలు సమకూర్చారు.

* కరోనా కారణంగా ‘సర్కారువారి పాట’ చిత్ర బృందం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ తర్వాత మహేశ్‌బాబు మోకాలికి శస్త్ర చికిత్స జరగడంతో కొన్నాళ్లు షూటింగ్‌ వాయిదా పడింది. అంతా బాగుందనే సమయానికి మహేశ్‌ కరోనా బారిన పడ్డారు. ఇలా ఎన్నో అడ్డంకులు ఈ చిత్రానికి ఎదురయ్యాయి.

* తొలుత ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13, 2022న విడుదల చేయాలని నిర్ణయించారు. షూటింగ్‌ ఆలస్యమవడంతో ఏప్రిల్‌ 1న 2022న విడుదల చేస్తామన్నారు. చివరకు మే 12న ‘సర్కారువారి పాట’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

* మహేశ్‌బాబు తనయ సితార ఇందులో ఓ పాటకు డ్యాన్స్‌ చేయడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

* కీర్తిసురేశ్‌ కీలక పాత్రల్లో ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు విడుదలయ్యాయి. ‘సర్కారువారి పాట’ మూడో చిత్రం.

* మహేశ్‌ కెరీర్‌లో మొత్తం నాలుగు చిత్రాలు మే నెలలో విడుదలయ్యాయి. నిజం, నాని, బ్రహ్మోత్సం, మహర్షి. ఇప్పుడు ఈ సినిమాలో ఐదోది.

* గతంలో మహేశ్‌ నటించిన ఐదు సినిమాలు గురువారం (బాబీ, సైనికుడు, అతిథి, ఖలేజా, మహర్షి) విడుదల కాగా, ఇప్పుడు ఈసినిమా ఆరోది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని