‘కృష్ణలంక’లో ఏం జ‌రిగింది? 

ప‌రుచూరి ర‌వి, న‌రేశ్ మేడి, ఆద‌ర్శ్, అనితా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో కృష్ణ‌లంక అనే చిత్రం తెర‌కెక్కుతోంది. వి.కార్తికేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ‘ఇంట్రో ఆఫ్ కృష్ణలంక’ పేరుతో ఓ వీడియోను విడుద‌ల చేసింది చిత్ర బృందం

Published : 01 Jun 2021 15:06 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌:  ప‌రుచూరి ర‌వి, న‌రేశ్ మేడి, ఆద‌ర్శ్, అనితా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో కృష్ణ‌లంక అనే చిత్రం తెర‌కెక్కుతోంది. వి.కార్తికేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ‘ఇంట్రో ఆఫ్ కృష్ణలంక’ పేరుతో ఓ వీడియోను విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఎలాంటి మాట‌లు లేకుండా యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో రూపొందించిన ఈ వీడియో ఆద్యంతం ఆస‌క్తిగా సాగింది. ఓ గ్రామంలో చోటు చేసుకున్న కొన్ని బృందాల ఘ‌ర్ష‌ణ‌లు ఇందులో క‌నిపిస్తాయి. నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటోంది. మ‌రి ‘కృష్ణలంక’ క‌థేంటి? అక్క‌డేం జ‌రిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాని సోహ్లా ప్రొడ‌క్ష‌న్స్, చేత‌న్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కృష్ణ సుర‌భ్ సంగీతం అందిస్తున్నారు. 
 


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని