Panchathantram: ఈతరం యువతకు ప్రతినిధి

రాహుల్‌ విజయ్,  శివాత్మిక రాజశేఖర్, సముద్రఖని, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. హర్ష     పులిపాక దర్శకుడు.   

Published : 08 Jun 2021 10:26 IST

రాహుల్‌ విజయ్,  శివాత్మిక రాజశేఖర్, సముద్రఖని, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకుడు. అఖిలేష్‌ వర్ధన్, సృజన్‌ ఎరబోలు నిర్మిస్తున్నారు. రాహుల్‌ విజయ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..‘‘రాహుల్‌ ఈ సినిమాలో సుభాష్‌ అనే 28ఏళ్ల యువకుడిగా కనిపిస్తారు. ఈతరం యువతకు ప్రతినిధిలా కనిపించే పాత్ర ఆయనది. చాలా సింపుల్‌గా రొమాంటిక్‌గా ఉంటుంది. పెళ్లి, జీవితాంతం కొనసాగే బంధాలు, బాధ్యతలు వంటి విషయాల్లో ఈతరం యువతకు ఉండే కన్ఫ్యూజన్, క్లారిటీని ఆయన పాత్రతో చూపించనున్నాం’’ అన్నారు.

‘‘నేటి యువతరానికి ప్రతినిధి లాంటి సుభాష్‌ పాత్రలో రాహుల్‌ ఎంతో సహజంగా నటిస్తున్నారు. మరో పదిరోజుల  చిత్రీకరణ మిగిలి ఉంది. జులైలో ఈ ఆఖరి షెడ్యూల్‌ ప్రారంభించాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకి సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌ విహారి. ఛాయాగ్రహణం: రాజ్‌ కె.నల్లి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు