ఫిట్‌నెస్‌ ట్రైనర్‌తో ప్రేమాయణం.. వీడియోతో ప్రకటించిన స్టార్‌హీరో కుమార్తె

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ ఖాన్‌ (Aamir Khan) కుమార్తె ఐరా ఖాన్‌ (Ira Khan) తన ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖారేతో...

Published : 24 Sep 2022 02:18 IST

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ ఖాన్‌ (Aamir Khan) కుమార్తె ఐరా ఖాన్‌ (Ira Khan) తన ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖారేతో  ప్రేమలో ఉన్నట్లు ఆమె తెలిపింది. సైక్లింగ్‌ పోటీల్లో పాల్గొనేందుకు ఇటీవల నుపుర్‌ విదేశాలకు వెళ్లగా ఐరా సైతం ఆయనకు తోడుగా వెళ్లింది.

పోటీలు ముగిసిన వెంటనే.. ఐరా వద్దకు చేరుకుని ఆమెను హత్తుకుని నుపుర్‌ ముద్దాడాడు. అనంతరం మోకాలిపై కూర్చొని.. ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని ఉంగరంతో ప్రపోజ్‌ చేశాడు. దీంతో ఐరా ‘‘ఎస్‌’’ అంటూ నవ్వులు చిందించగా ఆమె వేలికి ఉంగరాన్ని తొడిగి తమ బంధాన్ని అధికారికం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోని ఐరా తాజాగా ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ.. ‘‘నేను ఎస్‌ చెప్పాను’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన రియా చక్రవర్తి, ఫాతిమా సానా షేక్‌, రోహ్మాన్‌ షాల్‌, పలువురు సెలబ్రిటీలు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు.

గత కొన్నేళ్ల నుంచి అమిర్‌ ఖాన్‌కు వ్యక్తిగత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా నుపుర్‌ పనిచేస్తున్నాడు. దీంతో ఐరా సైతం నుపుర్‌ వద్ద ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ ఏర్పడింది. కొంతకాలానికి అది ప్రేమగా మారింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు 2020 నుంచే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ ఈ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. తాజా వీడియోతో తమ బంధాన్ని వీరిద్దరూ తెలియజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని