Iratta: ఓటీటీలో సూపర్‌హిట్‌ మలయాళ మూవీ.. తెలుగు వెర్షన్‌ వచ్చేసింది

జోజూ జార్జ్‌, అంజలి, మనోజ్‌ కె.యు. ఆర్యన్‌ సలీమ్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రోహిత్‌ ఎం. జి. కృష్ణన్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఇరాట్ట’. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ ఓటీటీలోకి వచ్చింది.

Published : 14 Mar 2023 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని సినిమాలు ఓటీటీలో ఒకేసారి పలు భాషల్లో విడుదలవుతుంటే.. కొన్ని చిత్రాలు ముందుగా మాతృభాషలో విడుదలై, ఆ తర్వాత ఇతర భాషల్లో రిలీజ్‌ అవుతున్నాయి. ఈ రెండో కోవకు చెందిందే సూపర్‌హిట్‌ మలయాళ మూవీ ‘ఇరాట్ట’ (Iratta). ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో మార్చి 3న స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చిన ఈ సినిమాని ఇప్పటికే ఎంతోమంది ప్రేక్షకులు చూశారు. ‘తెలుగు డబ్బింగ్‌ విడుదల చేస్తే బాగుణ్ను’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ఈ సినిమాని తెలుగులో రీమేక్‌ చేస్తారు. అందుకే తెలుగు ఆడియో ఇవ్వలేదు’ అంటూ పలువురు జోస్యం చెప్పారు. సదరు సంస్థ తెలుగు వెర్షన్‌ను ఇప్పుడు విడుదల చేసి ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. జోజూ జార్జ్‌, అంజలి, మనోజ్‌ కె.యు. ఆర్యన్‌ సలీమ్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రోహిత్‌ ఎం. జి. కృష్ణన్‌ ఈ సినిమాని తెరకెక్కించారు.

కథేంటంటే: కేరళలోని వాగమన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ ఫంక్షన్‌ జరుగుతూ ఉంటుంది. రాష్ట్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉండటంతో ఆ ఏరియాకు చెందిన పోలీసు ఉన్నతాధికారులందరూ స్టేషన్‌కు వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంటారు. మీడియా కూడా అక్కడకు చేరుకుని కవరేజ్‌ మొదలు పెడుతుంది. సడెన్‌గా పోలీస్‌స్టేషన్‌లో నుంచి మూడు రౌండ్లు తుపాకీ పేలిన శబ్దం వినిపిస్తుంది. పోలీసులు, మీడియా ఒక్కసారిగా స్టేషన్‌లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఏఎస్‌ఐ వినోద్‌ (జోజు జార్జి) రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంటాడు. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? డీఎస్పీ ప్రమోద్‌ (జోజు జార్జి)కు వినోద్‌కూ ఉన్న సంబంధం ఏంటి? స్టేషన్‌లో హత్య జరగడం వెనుక ఉన్నదెవరు? ఈ కేసు ఎలా పరిష్కారమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని