Iratta Review: రివ్యూ: ఇరాట్ట
Iratta Movie Review: మలయాళ చిత్రం ‘ఇరాట్ట’ ఎలా ఉందంటే?
Iratta Review; చిత్రం: ఇరాట్ట; నటీనటులు: జోజూ జార్జ్, అంజలి, మనోజ్ కె.యు. ఆర్యన్ సలీమ్, స్రింద తదితరులు; సంగీతం: జేక్స్ బిజోయ్; సినిమాటోగ్రఫీ: విజయ్; ఎడిటింగ్: మను ఆంటోనీ; నిర్మాత: ప్రశాంత్ కుమార్, చంద్రన్, జోజూ జార్జ్, మార్టిన్ ప్రకత్, సైజో వడ్డకన్; రచన, దర్శకత్వం: రోహిత్ ఎం.జి. కృష్ణన్; స్ట్రీమింగ్ వేదిక: నెట్‌ఫ్లిక్స్ (మలయాళం)
విభిన్న కథలకు, ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది మలయాళ చిత్ర పరిశ్రమ. చిన్న చిన్న సబ్జెక్ట్లతో అద్భుతమైన చిత్రాలను అక్కడి దర్శకులు తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, అక్కడ విజయవంతమైన చిత్రాలను ఇతర భాషల్లోనూ రీమేక్ చేస్తున్నారు. ఇటీవల మలయాళంలో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఇరాట్ట’. (Iratta Movie Review) అక్కడ ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అలరిస్తోంది. మరి ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది?
కథేంటంటే: కేరళలోని వాగమన్ పోలీస్‌స్టేషన్‌లో ఓ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. రాష్ట్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉండటంతో ఆ ఏరియాకు చెందిన పోలీసు ఉన్నతాధికారులందరూ స్టేషన్‌కు వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంటారు. మీడియా కూడా అక్కడకు చేరుకుని కవరేజ్ మొదలు పెడుతుంది. సడెన్‌గా పోలీస్‌స్టేషన్‌లో నుంచి మూడు రౌండ్లు తుపాకీ పేలిన శబ్దం వినిపిస్తుంది. పోలీసులు, మీడియా ఒక్కసారిగా స్టేషన్‌లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఏఎస్ఐ వినోద్ (జోజు జార్జి) రక్తపు మడుగులో విగతజీవుడిగా పడి ఉంటాడు. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? (Iratta Movie Review) డీవైఎస్పీ ప్రమోద్ (జోజు జార్జి)కు వినోద్‌కూ ఉన్న సంబంధం ఏంటి? స్టేషన్లో హత్య జరగడం వెనుక ఉన్నదెవరు? ఈ కేసు ఎలా పరిష్కారమైంది?
ఎలా ఉందంటే: మొదటి సన్నివేశం నుంచి చివరి వరకూ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తూ అలరించే జానర్ క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్లు. హత్య లేదా హత్యల వెనుక ఉన్నది ఎవరన్న విషయాన్ని గుప్పిట పట్టి ఉంచినంత వరకూ సినిమా విజయం సాధించినట్టే. అయితే, ఆ గుప్పిటను మరీ ఎక్కువ సేపు ఉంచితే ఉత్కంఠ కలగకపోగా విసుగొస్తుంది. పైగా ఆ హత్యకు కారణం బలంగా లేకపోతే సినిమా చూస్తున్న ప్రేక్షకుడు పెదవి విరుస్తాడు. కానీ, ‘ఇరాట్ట’ విషయంలో ఒక్కో చిక్కుముడి విప్పుతుంటే, ‘ఇంతకీ ఆ హత్య చేసింది ఎవర’న్న ఉత్కంఠ చివరి వరకూ కొనసాగుతుంది. (Iratta Movie Review) ఈ విషయంలో దర్శక-రచయిత జి.కృష్ణన్‌కు నూటికి నూరు మార్కులు వేయొచ్చు. ఏఎస్ఐ వినోద్ హత్యతో త్వరగానే కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. అక్కడి నుంచి సాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్, ప్రొసీడరల్ డ్రామా ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. తుపాకీ కాల్పులు వినిపించిన సమయంలో ముగ్గురు పోలీసులు స్టేషన్లో ఉండటంతో వారిలో హత్య ఎవరు చేశారన్న ఉత్కంఠ మొదలవుతుంది. ఒకపక్క ఆ కేసు ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన కథ నడుస్తూనే, మరోవైపు డీవైఎస్పీ ప్రమోద్, ఏఎస్ఐ వినోద్‌ల మధ్య ఉన్న సంబంధం.. వారి నేపథ్యాన్ని చూపించాడు దర్శకుడు. కథ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుట్‌లో నడుస్తూ ఉంటుంది.
ప్రమోద్ హత్య కేసుకు సంబంధించిన పోలీస్ ప్రొసీడల్ ఉత్కంఠగా సాగుతుంటే, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు మాత్రం కాస్త సాగదీసినట్లు అనిపిస్తాయి. పైగా ముగ్గురు పోలీస్ అధికారులతో వినోద్ అప్పటికే గొడవ పడి ఉండటం, డీవైఎస్పీ ప్రమోద్ అంటే కూడా వినోద్‌కు పడకపోవడంతో ఒకానొక దశలో ప్రమోద్ ఏమైనా హత్య చేశాడా? అన్న అనుమానం సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి కలుగుతుంది. ముగ్గురు పోలీసులతో వినోద్‌కు ఉన్న వైరాన్ని చూపిస్తూ ఒక్కో చిక్కుముడి విడిపోతున్నా ముగ్గురిలో హత్య ఎవరో చేశారో మాత్రం తెలియదు. వాళ్లు కాకుండా బయట వ్యక్తి వచ్చి హత్య చేశాడా? అన్న అనుమానం రేకెత్తుతుంది. (Iratta Movie Review) కేసు విచారణకు సంబంధించి డీవైఎస్పీ ప్రమోద్ రంగంలోకి దిగిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. చివరి 40-45 నిమిషాలు ఉత్కంఠతో ఊపేశాడు దర్శకుడు. వినోద్ చావుకు కారణం, క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించలేరు. క్రైమ్ థ్రిల్లర్లు చూసేవారు కూడా క్లైమాక్స్‌ను ఊహించడం కొంచెం కష్టం. ఈ సినిమా వీక్షించడానికి ప్రధాన అవరోధం భాష. కేవలం మలయాళంలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. ఒక భాషలో విజయవంతమైన చిత్రాలు ఓటీటీకి వచ్చే సరికి డబ్ అయి వస్తున్నాయి. ‘ఇరాట్ట’ విషయంలో అలా జరగలేదు. బహుశా డిజిటల్ రైట్స్ అంతవరకే ఇచ్చారేమో. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాలంటే ‘ఇరాట్ట’ ఏమాత్రం నిరాశ పరచదు. కాకపోతే అక్కడక్కడా కథనం నెమ్మదిగా సాగుతుంది.
ఎవరెలా చేశారంటే: డీవైఎస్పీ ప్రమోద్, ఏఎస్ఐ వినోద్‌గా ద్విపాత్రాభినయంలో జోజు జార్జ్ అదరగొట్టాడు. రెండు పాత్రల్లో ఆయన చూపిన వేరియేషన్, హావభావాలు ఆకట్టుకుంటాయి. ప్రమోద్ పాత్రలో కొన్ని నెగెటివ్ షేడ్స్ ఉంటే, వినోద్ పాత్రల్లో ఆ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇంతకుమించి ఆ పాత్ర గురించి చెబితే, స్పాయిలర్ అవుతుంది. అంజలి పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఒక్క డైలాగ్ కూడా ఉండదు. అయితే, హావభావాలతో తన పాత్రను రక్తిగట్టించారు. ఇతర నటీనటులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. జేక్స్ బిజోయ్ సంగీతం, విజయ్ సినిమాటోగ్రఫీ, మను ఆంటోనీ ఎడిటింగ్ బాగున్నాయి. (Iratta Movie Review) ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలే కాస్త సాగదీసినట్లు అనిపిస్తాయి. సన్నివేశాలు ఇంకాస్త షార్ప్ చేయొచ్చు. సినిమా మొత్తం స్టేషన్, దాని చుట్టుపక్కల జరుగుతుంది. దర్శక-రచయిత రోహిత్ ఎం.జి. కృష్ణన్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తాను అనుకున్న పాయింట్ ఎగ్జిక్యూట్ చేయడంలో ఆయన విజయం సాధించారు. మొదటి నుంచి చివరి వరకూ ప్రేక్షకుడిని స్క్రీన్కు ఎంగేజ్ చేయడంలో సఫలమయ్యారు. పతాక సన్నివేశాలు సినిమాకే హైలైట్. ప్రతి పాత్రను క్రైమ్ సీన్‌కు కనెక్ట్ అయ్యేలా రాసుకున్న తీరు బాగుంది.
బలాలు: 👍 దర్శకుడు ఎంచుకున్న పాయింట్; 👍 పతాక సన్నివేశాలు; 👍 జోజు జార్జ్ నటన, కృష్ణన్ దర్శకత్వం
బలహీనతలు: 👎 ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు; 👎 అక్కడక్కడ నెమ్మదిగా సాగే కథనం
చివరిగా: ఊహించని క్లైమాక్స్‌తో అలరించే ‘ఇరాట్ట’
గమనిక: ఈ సమీక్షసమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే? -
Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
Sharathulu Varthisthai Review: చైతన్యరావు కీలక పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ మెప్పించిందా? -
Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?
సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీఖన్నా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించిందా..? -
Razakar Movie Review: రివ్యూ: రజాకార్.. బాబీ సింహా, అనసూయ నటించిన మూవీ ఎలా ఉంది?
Razakar Movie Review: తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో రూపొందిన ‘రజాకార్’ ఎలా ఉందంటే? -
Merry Christmas review: రివ్యూ: మెర్రీ క్రిస్మస్.. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన చిత్రం ఎలా ఉందంటే?
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మెర్రీ క్రిస్మస్’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలా ఉందంటే? -
Anweshippin Kandethum Review: రివ్యూ: అన్వేషిప్పిన్ కండెతుమ్.. మలయాళ బ్లాక్‌బస్టర్ ఎలా ఉంది?
Anweshippin Kandethum Review: టొవినో థామస్ కీలకపాత్రలో నటించిన పోలీస్ ప్రొసీడల్ డ్రామా మెప్పించిందా? -
Shaitaan Movie Review: రివ్యూ: షైతాన్.. మాధవన్ నెగెటివ్ షేడ్స్‌లో నటించిన మూవీ మెప్పించిందా?
Shaitaan Movie Review: అజయ్ దేవ్‌గణ్, జ్యోతిక, మాధవన్ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది? -
Breathe Review: రివ్యూ: బ్రీత్.. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?
Breathe telugu movie Review: నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయమైన సినిమా ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ఉపశీర్షిక. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం ఎలా ఉందంటే? -
Bhimaa movie review: రివ్యూ: భీమా.. గోపిచంద్ ఖాతాలో హిట్ పడిందా?
Bhimaa movie review: యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్న గోపిచంద్ కీలక పాత్రలో నటించిన ‘భీమా’ మూవీ మెప్పించిందా? -
Gaami review: విశ్వక్సేన్ నటించిన ‘గామి’ ఎలా ఉందంటే..!
అఘోరాగా విశ్వక్సేన్ నటించిన చిత్రం ‘గామి’. మరి ఈ పాత్రలో విశ్వక్ భయపెట్టాడో.. లేదో తెలుసుకుందాం. -
Premalu Movie Review: రివ్యూ: ప్రేమలు.. మలయాళ బ్లాక్‌బస్టర్ తెలుగులో ఎలా ఉంది?
Premalu Movie Review: మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమలు’ తెలుగులోనూ అదే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిందా? -
Valari Review: రివ్యూ: వళరి.. రితికా సింగ్ నటించిన హారర్ మూవీ ఎలా ఉందంటే?
Valari Review: రితికా సింగ్ నటించిన హారర్ చిత్రం ‘వళరి’. నేరుగా ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? -
The Indrani Mukerjea Story: రివ్యూ: ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’.. షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ
షీనా బోరా హత్య కేసుపై రూపొందిన డాక్యుమెంటరీ సిరీస్ ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
Bhoothaddam Bhaskar Narayana Review: రివ్యూ: భూతద్దం భాస్కర్ నారాయణ.. థ్రిల్ పంచాడా?
Bhoothaddam Bhaskar Narayana Review: శివ కందుకూరి కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఎలా ఉంది? ప్రేక్షకులకు థ్రిల్ పంచిందా? -
Operation Valentine Review: రివ్యూ: ఆపరేషన్ వాలెంటైన్.. వరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
Operation Valentine Review in telugu: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వరుణ్ తేజ్ కీలక పాత్రలో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మెప్పించిందా? -
Malaikottai Vaaliban: రివ్యూ: మలైకోటై వాలిబన్.. మోహన్‌లాల్ నటించిన పీరియాడికల్ చిత్రం ఎలా ఉందంటే?
మలయాళ నటుడు మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం ‘మలైకోటై వాలిబన్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందంటే? -
siddharth roy movie review: రివ్యూ: సిద్ధార్థ్ రాయ్.. దీపక్ సరోజ్ నటించిన మూవీ ఎలా ఉంది?
siddharth roy movie review: ప్రచార చిత్రాలతో ఆసక్తిని పెంచిన ‘సిద్ధార్థ్ రాయ్’ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!