Naga Chaitanya: ఎన్ని కథలో...

తెలుగులో యువ కథానాయకులు బోలెడు మంది. ఒకొక్కరూ రెండు మూడు సినిమాలకి పచ్చజెండా ఊపేసి వేగం పెంచిన సమయమిది. ఇలాంటి పరిస్థితుల్లోనూ నాగచైతన్య కోసం ఐదారు కథలు సిద్ధం

Updated : 20 Feb 2022 08:55 IST

తెలుగులో యువ కథానాయకులు బోలెడు మంది. ఒకొక్కరూ రెండు మూడు సినిమాలకి పచ్చజెండా ఊపేసి వేగం పెంచిన సమయమిది. ఇలాంటి పరిస్థితుల్లోనూ నాగచైతన్య కోసం ఐదారు కథలు సిద్ధం అవుతున్నాయి. పలువురు యువ దర్శకులు ఆయన్ని లక్ష్యంగా చేసుకుని స్క్రిప్టులు రెడీ చేస్తున్నారు. ఇటీవలే విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ‘థ్యాంక్‌ యూ’ చిత్రాన్ని పూర్తి చేసిన నాగచైతన్య కోసం తమిళ దర్శకుడు వెంకట్‌ప్రభు మొదలుకొని, రాహుల్‌ సంకృత్యాన్‌ వరకు పలువురు దర్శకులు కథలు సిద్ధం చేస్తున్నారు. తిరుమల కిషోర్‌, నందినిరెడ్డి, విజయ్‌ కనకమేడలతోపాటు, శివ నిర్వాణ నాగచైతన్యతో మరో చిత్రం చేసేందుకు స్క్రిప్ట్‌లు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ పోటీ మధ్య సరైన కథలు దొరకడమే కష్టం అనుకుంటున్న ఈ పరిస్థితుల్లోనూ నాగచైతన్య జోరు ప్రదర్శిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని