KGF3: ‘కేజీయఫ్‌3’లో హృతిక్‌ రోషన్‌.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కేజీయఫ్‌2’. భారీ అంచనాలతో ఏప్రిల్‌ 14న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకొని రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.

Published : 28 May 2022 02:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కేజీయఫ్‌2’. భారీ అంచనాలతో ఏప్రిల్‌ 14న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకొని రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ క్రమంలో ‘కేజీయఫ్‌3’ గురించి చర్చ మొదలైంది. తాజాగా ఈ విషయమై హృతిక్‌ రోషన్‌ని ఈ చిత్రబృందం సంప్రదించిందని.. ‘కేజీయఫ్‌3’లో హృతిక్‌ నటించనున్నారన్న వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై కేజీయఫ్‌ నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ స్పందించారు.

‘‘కేజీయఫ్‌3 ఈ సంవత్సరం ఉండదు. మేము దీని కోసం కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. త్వరలోనే యశ్‌ తన కొత్త సినిమాని ప్రకటించనున్నాడు. వాళ్లకి సమయం దొరికినప్పుడు ‘కేజీయఫ్‌3’కు సంబంధించిన పనులు ప్రారంభిస్తాం. ప్రస్తుతానికి ఛాప్టర్‌3 ఎప్పుడు ప్రారంభమవుతుందనేది చెప్పలేదు. మేము ఈ సినిమాకు పనులు మొదలుపెట్టాక అందులో ఎవరెవరు నటిస్తున్నారో చెబుతాము. అప్పుడు ఎవరు అవసరమైతే వారిని సంప్రదిస్తాం’’ అంటూ రూమర్స్‌కు చెక్‌పడేలా కేజీయఫ్‌3 నిర్మాత సమాధానం ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని