Ileana: స్టార్‌హీరోయిన్‌ సోదరుడితో ఇలియానా ప్రేమాయణం..?

గోవా బ్యూటీ ఇలియానా (Ileana) మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ హీరోయిన్‌ సోదరుడితో ఆమె డేటింగ్‌లో ఉన్నారంటూ...

Published : 17 Jul 2022 15:24 IST

వైరల్‌గా మారిన ఫొటోలు

ఇంటర్నెట్‌డెస్క్‌: గోవా బ్యూటీ ఇలియానా (Ileana) మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ హీరోయిన్‌ సోదరుడితో ఆమె డేటింగ్‌లో ఉన్నారంటూ ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ బీటౌన్‌ లేడీ బర్త్‌డే వేడుకల్లోనూ ఇలియానా పాల్గొని సందడి చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఇంతకీ ఆ బాలీవుడ్‌ భామ ఎవరంటే.. కత్రినా కైఫ్ (Katrina Kaif)‌.

‘దేవదాసు’తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. టాలీవుడ్‌లో స్టార్‌హీరోయిన్‌గా రాణించారు. ‘బర్ఫీ’తో అటు బాలీవుడ్‌లోకీ అడుగుపెట్టారు. ప్రస్తుతం సరైన విజయాల్లేక సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న ఆమె కత్రినా కైఫ్‌ సోదరుడు సెబాస్టియన్‌తో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది కత్రినా.. తన పుట్టినరోజు వేడుకల కోసం భర్త విక్కీ, సోదరుడు సెబాస్టియన్‌, ఇతర కుటుంబసభ్యులతో కలిసి మాల్దీవులకు వెళ్లగా ఈ వేడుకల్లో ఇలియానా సైతం పాల్గొన్నారు. సెబాస్టియన్‌తో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను కత్రినా, ఇలియానా ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. వీటిని చూసిన నెటిజన్లు.. ‘‘ఎలాంటి సంబంధం లేకుండా ఇలియానా ఈ వేడుకల్లో ఎందుకు పాల్గొన్నారు?’’ అని చర్చించుకుంటున్నారు. దీంతో ఈ జంట ప్రస్తుతం డేటింగ్‌లో ఉందంటూ పలు ఆంగ్ల వెబ్‌సైట్‌లలో వార్తలు వెల్లువడ్డాయి. మరోవైపు సెబాస్టియన్‌ ఇన్‌స్టా ఖాతాని ఇలియానా గత కొంతకాలంగా ఫాలో అవుతున్నారు. ఇక, ఇలియానా గతంలో ఆండ్రూ అనే ఓ విదేశీ ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ 2019లో విడిపోయారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts