Chiranjeevi: చిరు పేరు మార్పు.. న్యూమరాలజీనా? లేదా టీమ్‌ తప్పిదమా?

‘మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) న్యూమరాలజీ ఫాలో అవుతున్నారా?’ గడిచిన రెండు రోజుల నుంచి సినీ ప్రియుల్ని ఇదే ప్రశ్న వెంటాడుతోంది. తాజాగా విడుదలైన ‘గాడ్‌ఫాదర్‌’ (Godfather) ఫస్ట్‌లుక్‌ వీడియోనే దీనికి కారణం. అందులో ఆయన పేరులో కాస్త మార్పుల...

Updated : 06 Jul 2022 14:18 IST

హైదరాబాద్‌: ‘మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) న్యూమరాలజీ ఫాలో అవుతున్నారా?’ గడిచిన రెండు రోజుల నుంచి ఆయన అభిమానుల్ని ఇదే ప్రశ్న వెంటాడుతోంది. తాజాగా విడుదలైన ‘గాడ్‌ఫాదర్‌’ (Godfather) ఫస్ట్‌లుక్‌ వీడియోనే దీనికి కారణం. అందులో ఆయన పేరులో కాస్త మార్పులు కనిపించాయి. సక్సెస్‌ కోసమే చిరు తన పేరులో స్వల్ప మార్పులు చేసుకున్నారని పలువురు అనుకుంటున్నారు. ఇంతకీ, చిరంజీవి పేరులో వచ్చిన మార్పులు ఏమిటి? ఆయన నిజంగానే న్యూమరాలజీ ఫాలో అవుతున్నారా? లేదా టీమ్‌ తప్పిదమా?

చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’. మలయాళీలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘లూసిఫర్‌’ రీమేక్‌ ఇది. మోహన్‌రాజా(MohanRaja) దర్శకుడు. సోమవారం సాయంత్రం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ మోషన్‌పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో చిరంజీవి పాత్రని పరిచయం చేస్తూ ఆయన పేరుని ‘Chiranjeevi’కి బదులు ‘Chiranjeeevi’ అని చూపించారు. ఇక, టైటిల్‌ కార్డులో మాత్రం megastar CHIRANJEEVI అనే ఉంచారు. ఇది గమనించిన కొంతమంది నెటిజన్లు.. ‘న్యూమరాలజీని అనుసరించే చిరు తన స్పెల్లింగ్‌లో మరో ‘E’ కలుపుకొన్నారా?’ అని చర్చించుకున్నారు. ఇదిలా ఉండగా, ‘గాడ్‌ఫాదర్‌’ మోషన్‌ పోస్టర్‌లో చిరు పేరులో మార్పుకి టీమ్‌ తప్పిదమే కారణమని తాజాగా వార్తలు బయటకు వస్తున్నాయి. టీమ్ చేసిన పొరపాటుతోనే మోషన్‌ పోస్టర్‌లో చిరు పేరు రెండు రకాలుగా కనిపిస్తోందని, ప్రస్తుతం చిత్రబృందం ఆ పేరుని ఎడిట్‌ చేసి.. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటోందని పలు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.

పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇందులో చిరు పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించనున్నారు. సత్యదేవ్‌, సల్మాన్‌ఖాన్‌, పూరీజగన్నాథ్‌.. ఇలా పలువురు సెలబ్రిటీలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. చిరు సోదరి పాత్రలో నయనతార నటించనున్నారు. ప్రస్తుతం ఈసినిమా చిత్రీకరణ దశలో ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని