Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!

బాలీవుడ్‌ నటులు కియారా అడ్వాణీ, సిద్ధార్థ్‌ మల్హోత్ర పెళ్లి త్వరలోనే అంటూ బాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తోంది. పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.

Updated : 02 Feb 2023 11:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటులు కియారా అడ్వాణీ (Kiara Advani), సిద్ధార్థ్‌ మల్హోత్ర (Sidharth Malhotra) ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటివరకూ స్పందించని ఈ జోడీ పెళ్లి పనుల్లో నిమగ్నమైందంటూ బాలీవుడ్‌ మీడియాలో ప్రస్తుతం కథనాలు వెలువడుతున్నాయి. ఫిబ్రవరి 4, 5న సంగీత్‌, హల్దీ వేడుక (దుబాయ్‌లో) ఉంటుందని, వివాహం 6న జరగనుందని పలు వెబ్‌సైట్లు పేర్కొంటున్నాయి. జైసల్మీర్‌ (రాజస్థాన్‌)లోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను కియారా- సిద్ధార్థ్‌ తమ వివాహ వేదికగా ఎంపిక చేసుకున్నారట. ఇరు కుటుంబాలు సహా వారి సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజరుకానున్నారని టాక్‌ వినిపిస్తోంది. సినీ ప్రముఖుల కోసం ముంబయిలో రిసెప్షన్‌ను ప్లాన్‌ చేస్తున్నారని, పెళ్లి వేడుక మొత్తాన్ని డాక్యుమెంటరీగా రూపొందించే ఆలోచనలో ఉన్నారని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మరి, ఇది నిజంకాదంటూ ఆ జంట స్పందిస్తుందా? పెళ్లి ఫొటోలు పంచుకుని అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేస్తుందా? అంటే వేచి చూడాల్సిందే.

2021లో ‘షేర్షా’ సినిమాతో ఈ నటులిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ఆన్‌ స్క్రీన్‌ పెయిర్‌ బయట క్లోజ్‌గా కనిపించడంతో ప్రేమలో పడ్డారని చాలామంది అనుకున్నారు. ఆ విషయమై పలు టెలివిజన్‌ కార్యక్రమాల్లో వీరికి ప్రశ్నలు ఎదురవ్వగా సమాధానాన్ని దాటవేసేవారు. ‘భరత్‌ అనే నేను’, ‘వినయ విధేయ రామ’లతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కియారా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు