Kamal Haasan: సింగిల్‌ టేక్‌ డైలాగ్‌.. 14 భాషల్లో కమల్‌ హాసన్‌ డైలాగ్‌?

కమల్‌ హాసన్‌ ఆ క్రేజీ ప్రాజెక్టులో 14 భాషల్లో భారీ డైలాగ్‌ చెప్పి, చిత్ర బృందాన్ని ఆశ్చర్యానికి గురిచేశారని సమాచారం.

Published : 15 Sep 2022 17:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కమల్‌ హాసన్‌ (Kamal Haasan) హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్‌ ‘ఇండియన్‌ 2’ (Indian 2). ఈ సినిమా గురించి కోలీవుడ్‌ వర్గాల్లో ఆసక్తికర అప్‌డేట్‌ చక్కర్లు కొడుతోంది. సుమారు 10 నిమిషాల నిడివి ఉండే ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ని కమల్‌ సింగిల్‌ టేక్‌లో చెప్పారట. ఆ సంభాషణలో 14 భాషలు వినిపిస్తాయని సమాచారం. కమల్‌ నాన్‌స్టాప్‌గా చెప్పడంతో చిత్ర బృందం అవాక్కైందట. కథానాయకుడి పాత్ర డిమాండ్‌ మేరకు కమల్‌ ఈ చిత్రంలో 14 భాషల్లో మాట్లాడతారనే టాక్‌ వినిపిస్తోంది. ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. 1996లో ఇదే కాంబినేషన్‌లో వచ్చి, ఘన విజయం అందుకున్న ‘ఇండియన్‌’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది. పలు కారణాల వల్ల చిత్రీకరణ వాయిదా పడిన ఈ ప్రాజెక్టు ఇటీవల పునఃప్రారంభమైంది. కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సిద్ధార్థ్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలకానుంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts