Pooja Hegde: బడా హీరోతో డేటింగ్‌పై పూజాహెగ్డే క్లారిటీ

తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నానంటూ వస్తోన్న వార్తలపై నటి పూజాహెగ్డే (Pooja hegde) స్పందించారు. ‘కిసీ కా బాయ్‌ కిసీ కీ జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పాల్గొన్నారు.

Published : 14 Apr 2023 15:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ బడా హీరో సల్మాన్‌ఖాన్‌ (salmankhan)తో నటి పూజాహెగ్డే (pooja hegde) ప్రేమలో ఉందంటూ ఎన్నో రోజుల నుంచి వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఆ వార్తలపై ఆమె తాజాగా స్పందించారు. ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్‌పైనే ఉందని చెప్పారు.

‘‘నా గురించి తరచూ ఎన్నో వార్తలు వస్తుంటాయి. వాటన్నింటినీ నేను చదువుతూనే ఉంటాను. వాటిని పెద్దగా పట్టించుకోను. ప్రస్తుతానికి నేను సింగిల్‌నే. నాకు సింగిల్‌గా ఉండటమే చాలా ఇష్టం. అలాగే, నా ఫోకస్‌ మొత్తం సినిమాలపైనే ఉంది. వేర్వేరు భాషల్లో మరెన్నో చిత్రాల్లో నటించాలని ఉంది. అదే నా లక్ష్యం. ఇలాంటి వదంతులపై స్పందించే సమయం కూడా నాకు లేదు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను’’ అని ఆమె (pooja hegde) స్పష్టం చేశారు.

పూజాహెగ్డే బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘హౌస్‌ఫుల్‌ 4’, ‘సర్కస్‌ 3’ వంటి బీటౌన్‌ సినిమాల్లో నటించినప్పటికీ ఆశించినంత గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఆమె ఆశలన్నీ త్వరలో విడుదల కానున్న ‘కిసీ కా బాయ్‌ కిసీ కీ జాన్‌’ (kisi ka bhai kisi ki jaan)పై పెట్టుకున్నారు. సల్మాన్‌ఖాన్‌ (salman khan) హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్‌ 21న విడుదల కానుంది. వెంకటేశ్‌, భూమిక కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయం నుంచే సల్మాన్‌ - పూజా ప్రేమలో ఉన్నట్లు పలు కథనాలు వెలువడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని