Rana Daggubati: ఆ సూపర్‌హిట్ సినిమా రీమేక్‌లో రానా?
శింబు హీరోగా తెరకెక్కి, మంచి హిట్ అందుకున్న చిత్రం ‘మానాడు’. తెలుగులో ‘ది లూప్’ పేరుతో (ఓటీటీలో) విడుదలై ఇక్కడా విజయాన్ని సాధించింది. ఇదే సినిమాను తెలుగు హీరోతో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ హక్కుల్ని సొంతం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: శింబు హీరోగా తెరకెక్కి, మంచి హిట్ అందుకున్న చిత్రం ‘మానాడు’ (Maanaadu). తెలుగులో ‘ది లూప్’ (The Loop) పేరుతో (ఓటీటీలో) విడుదలై ఇక్కడా విజయాన్ని సాధించింది. ఇదే సినిమాను తెలుగు హీరోతో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ హక్కుల్ని సొంతం చేసుకుంది. నాగచైతన్య (Naga Chaiatnay) హీరోగా ఈ సినిమా రూపొందే అవకాశం ఉందని ఇటీవల ప్రచారం సాగింది. ఇప్పుడు ఆ స్థానంలో రానా (Rana Daggubati) నటిస్తారా? అనే ఆసక్తి నెలకొంది. ఎందుకంటే.. తాను హీరోగా తెరకెక్కిన ‘థ్యాంక్ యూ’ (Thank You) సినిమా ప్రచారంలో చైతన్య ఈ రీమేక్‌పై స్పందించినట్టు, రానా ఈ చిత్రంలో భాగస్వామి కానున్నారని తెలిపినట్టు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి, ఈ రీమేక్‌కు రానా నిర్మాతగా వ్యవహరిస్తారా? నటిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే.
నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించిన ‘థ్యాంక్ యూ’ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్న ప్రేమకథతో రూపొందిన ఈ సినిమాలో రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికాగోర్ కథానాయికలు. నాగచైతన్య తదుపరి సినిమా ‘మానాడు’ దర్శకుడు వెంకట్ ప్రభుతో చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్