Bollywood: అసిస్టెంట్‌ డైరెక్టర్‌తో హీరోయిన్‌ డేటింగ్‌

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె సారా అలీఖాన్‌ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఆమె కథానాయికగా వెండితెరకు పరిచయమైన ‘కేదార్‌నాథ్‌’ సినిమా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జహన్‌ హండాతో ఆమె డేటింగ్‌లో ఉందంటూ పలు ఆంగ్ల పత్రికల్లో....

Published : 03 Jul 2021 13:35 IST

టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన స్టార్‌ హీరో కుమార్తె వ్యవహారం

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె సారా అలీఖాన్‌ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఆమె కథానాయికగా వెండితెరకు పరిచయమైన ‘కేదార్‌నాథ్‌’ సినిమా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జహన్‌ హండాతో డేటింగ్‌లో ఉందంటూ పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హాలీడేలో భాగంగా ఓ బీచ్‌లో సారాతో కలిసి దిగిన ఫొటోలను ఇటీవల జహన్‌ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేశాడు. కాగా.. ఈ పోస్ట్‌ని రీషేర్ చేస్తూ.. ‘ఐ లవ్‌ యూ.. మళ్లీ ఆ రోజులకు తీసుకు వెళ్లు’ అని సారా రిప్లై ఇచ్చారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నమాట వాస్తవమేనని అందరూ అనుకుంటున్నారు. గతేడాది సారా పుట్టినరోజు సమయంలోనూ ఆమెకు సంబంధించిన పలు ఫొటోలను జహన్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు.

‘కేదారనాథ్‌’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సారా అలీఖాన్‌.. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌తో ఎంతో స్నేహంగా ఉన్నారు. దాంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ చెప్పుకున్నారు. కానీ వీరిద్దరూ ఆ విషయంపై ఎప్పుడూ పెదవి విప్పలేదు. అనంతరం, ‘లవ్‌ ఆజ్‌కల్‌’ సినిమా షూట్‌ సమయంలో నటుడు కార్తీక్‌ ఆర్యన్‌-సారా ప్రేమలో ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts