‘మహేశ్‌ బాబు-త్రివిక్రమ్‌’ల సినిమా స్టోరీ లైన్‌ అదేనా?

ముచ్చటగా మూడోసారి, సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు(Mahesh babu)-త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్లో వస్తున్న ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ#28’(SSMB#28) పై ప్రేక్షకులు, అభిమానులకు...

Published : 12 Jul 2022 14:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహేశ్‌ బాబు(Mahesh babu)-త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్‌లో వస్తున్న ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ#28’(SSMB#28) పై ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఆగస్టు మొదటివారం నుంచి షూటింగ్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ మూవీ జోనర్‌ ఏంటి అనే దానిపై ప్రస్తుతం చర్చ నెలకొంది. కొంతకాలంగా యాక్షన్‌ డ్రామా స్టోరీలపై దృష్టి సారించి సైలెంట్‌ బ్లాక్‌ బస్టర్లతో దూసుకుపోతున్నారు దర్శకుడు త్రివిక్రమ్‌. అయితే మహేశ్‌ బాబుతో పదేళ్ల తరువాత సినిమా తీస్తుండటంతో కొత్త తరహా రాజకీయ నేపథ్యాన్ని కథగా ఎంచుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. భారీ తారగణంతో తెరకెక్కించనున్న ఈ సినిమాలో పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌తో పాటుగా తనదైన యాక్షన్‌శైలి, డ్రామాను అన్వయించి సరికొత్త కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడ లేదు. ఇదే నిజమైతే మహేశ్‌ బాబును మరొక్కసారి రాజకీయనేతగా చూడవచ్చు. ఇంతకుముందు రాజకీయనేపథ్యంలో వచ్చిన ‘భరత్‌ అనే నేను’ బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. మరిప్పుడు త్రివిక్రమ్‌ ఏ రేంజ్‌లో మహేశ్‌ను చూపిస్తారనే విషయంపై అభిమానులతో పాటు, ప్రేక్షకుల్లోను ఆసక్తి నెలకొంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts