Raviteja: స్పీడ్‌ పెంచిన రవితేజ.. బెల్లంకొండ శ్రీనివాస్‌ సినిమా ఆగినట్టేనా?

స్టూవర్టుపురం గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఏకకాలంలో రెండు సినిమాలు తెరకెక్కుతుండటం ఇటీవల టాలీవుడ్‌లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అందులో ఒకటి రవితేజ...

Published : 21 Jan 2022 10:42 IST

హైదరాబాద్‌: స్టూవర్టుపురం గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఏకకాలంలో రెండు సినిమాలు తెరకెక్కుతుండటం ఇటీవల టాలీవుడ్‌లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అందులో ఒకటి రవితేజ కథానాయకుడిగా రానున్న ‘టైగర్‌ నాగేశ్వరావు’, మరొకటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా రూపుదిద్దుకుంటోన్న ‘స్టూవర్టుపురం దొంగ’. ఇప్పటికే ‘స్టూవర్టుపురం దొంగ’ షూటింగ్‌ ప్రారంభం కావడం.. సాయి శ్రీనివాస్‌పై పలు కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. కాగా, తాజా సమాచారం ప్రకారం రవితేజ తీసుకున్న ఓ నిర్ణయంతో ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ సినిమా మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.

సాధారణంగానే బయోపిక్‌లకు ప్రేక్షకాదరణ మెండుగా ఉంటుంది. అందులోనూ గజదొంగ జీవితం కావడంతో ఈ బయోపిక్‌పై అందరిలో ఆసక్తి ఎక్కువగానే ఉంది. దాంతో ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రాన్ని పాన్‌ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆ చిత్రబృందం భావించింది. ఈ క్రమంలోనే ఆ సినిమాని త్వరితగతిన పూర్తి చేసి థియేటర్లలో విడుదల చేయాలని సదరు టీమ్‌ భావిస్తుందట.  దీంతో అదే కథతో తెరకెక్కుతోన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ‘స్టూవర్టుపురం దొంగ’ సినిమా ఆపేయాలని ఈ చిత్రబృందం భావిస్తుందట. ఈ మేరకు సినిమా షూటింగ్‌ కూడా నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని