Kajal: చందమామ.. చంద్రముఖిగా?

నవతరం కథానాయికలు కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు. పెళ్లి, పిల్లల తర్వాత కెరీర్‌ పరంగా అదే జోరు కొనసాగిస్తున్నారు. ఆ విషయంలో బాలీవుడ్‌ నాయికలు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇదివరకు హీరోయిన్లు పెళ్లి చేసుకోవాలంటే, కెరీర్‌ ఏమైపోతుందో అని భయపడేవారు.

Updated : 14 Oct 2022 07:34 IST

వతరం కథానాయికలు కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు. పెళ్లి, పిల్లల తర్వాత కెరీర్‌ పరంగా అదే జోరు కొనసాగిస్తున్నారు. ఆ విషయంలో బాలీవుడ్‌ నాయికలు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇదివరకు హీరోయిన్లు పెళ్లి చేసుకోవాలంటే, కెరీర్‌ ఏమైపోతుందో అని భయపడేవారు. ఇప్పుడు ఆ వరస మారింది. హిందీలో హీరోల తరహాలోనే హీరోయిన్లు పెళ్లి తర్వాత, పిల్లలు పుట్టాక కూడా కెరీర్‌ని కొనసాగిస్తున్నారు. దక్షిణాదిలో కూడా అంతే. అనుభవం, అవసరం అక్కరకొస్తుండడంతో... ఇదివరకటిలాగే వాళ్లకి పరిశ్రమ మళ్లీ అవకాశాల్ని కట్టబెడుతోంది. నయనతార, శ్రియ, సమంత, కాజల్‌... వీళ్లంతా కూడా ఇప్పుడు బిజీగానే ఉన్నారు. నెలల కిందటే బాబుకి జన్మనిచ్చిన కాజల్‌ అగర్వాల్‌ (Kajal) అవకాశాల విషయంలో మరింత జోరుని కనబరుస్తోంది. ‘ఇండియన్‌ 2’ (Indian 2) కోసం ఇప్పటికే రంగంలోకి దిగిన ఆమె చేతికి మరో సినిమా కూడా అందినట్టు సమాచారం. ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2) కోసం ఆమె సంతకం చేసినట్టు తెలిసింది. చందమామ కాస్త చంద్రముఖి అవుతోందన్నమాట. లారెన్స్‌ కథానాయకుడిగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇప్పటికే చిత్రీకరణ షురూ అయ్యింది. మళ్లీ కెమెరా ముందుకు అడుగుపెట్టడంతో కాజల్‌ కొన్నాళ్లుగా తన లుక్‌పై దృష్టి సారించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని